100th sentiment with krish aka krishna..!

krish

100వ కృష్ణ  వెనుక కథ..!

ఒకవైపు చిరంజీవి 150వ సినిమా సస్పెన్స్ ఇంకా వీడక ముందే, బాలయ్య 100వ సినిమా అంటూ మరో సస్పెన్స్ కు తెర లేపారు. మొదట్లో ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తారని అనుకున్నా కనీసం లెక్కలో లేనట్లు బోయపాటిని ప్రక్కన పెట్టి కృష్ణ వంశీని తెరపైకు తెచ్చారు. రైతు ప్రధానాంశం గా కథ ఉంటుందని అన్నారు.

దీనిపై ఏ ప్రకటన విడుదల కానప్పటికీ, అంతలోనే శాతవాహన రాజుల కథ అంటూ దానికి క్రిష్ దర్శకత్వం వహిస్తారని మరో వాదన వినపడుతున్న నేపథ్యంలో అసలు కృష్ణ , క్రిష్ పేర్లే ఎందుకు పరిగణలో తీసుకున్నారోనన్న వింత చర్చ తెరపై కి వచ్చింది.

ఆరా తీస్తే సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యం పై నమ్మకంతోనే తన వందవ చిత్రానికి కృష్ణ పేరుతో మొదలయ్యే దర్శకున్ని ఎన్నుకోనున్నారని, ఆ దర్శకుల లిస్టు లో కృష్ణ వంశీ, క్రిష్ పేర్లు రావడంతో వారిద్దరిలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. గతంలో కూడా ఇలా పేర్లు చూసుకుని దర్శకున్ని ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయని సినీ పెద్దల మాట. ఏ విషయం తేలాలంటే వచ్చే ఉగాది వరకు ఆగాల్సిందే.

Related posts

Top