16 (Every Detail Counts) Review

16p

ఎగ్ సిగ్నల్: 3sii
బ్యానర్:  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
తారాగణం: రెహమాన్, అశ్విని కుమార్, ప్రకాష్, ప్రవీణ్, శరత్ కుమార్, బాల హాసన్, అంజనా జయప్రకాష్ , యాషిక ఆనంద్… తదితరులు
సంగీతం: జెక్స్ బిజోయ్
ఎడిటింగ్:శ్రీజిత్ సారంగ్
కెమెరా: సుజిత్ సారంగ్
రచన- దర్శకత్వం: కార్తీక్ నరేన్
నిర్మాత: చదలవాడ పద్మావతి
విడుదల:  10.03.17

కథ
అనగనగా.. రెహమాన్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒకరాత్రి జరిగిన ఒక అబ్బాయి మర్డర్, ఒకమ్మాయి మిస్సింగ్ మిస్టరీని ఛేదించే క్రమంలో ఒక నిజాయితీ కానిస్టేబుల్ గౌతమ్ తన పంధాలో క్లూస్ సంపాదించి ఇన్స్పెక్టర్ రెహమాన్ కు సహకరించడం. అదే సంఘటనలో ముగ్గురు యువకులు కార్ తో ఒకరిని  ఏక్సిడెంట్ చేసి, భయపడి ఆ శవాన్ని డిక్కీలో తీసుకెళ్లడం. ఈ సంఘటన కొంతభాగాన్ని ఒక పేపర్ బాయ్ చూడడం.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ తరువాత ఆ హంతకుడు దొరికే క్రమంలో, పోలీస్ కార్ ఏక్సిడెంట్ కు గురికావడంతో గాయపడిన ఇన్స్పెక్టర్  పోలీస్ జాబ్ నుండి తప్పుకోవడం.

ఈ కేసు విషయమై ఒక అజ్ఞానవ్యక్తితో రెహమాన్ డిస్కస్ చేసే క్రమంలో కథ మొదలై చివరకు అక్కడే కథ పూర్తవ్వడమే ఈ 16 కథ.

కళాపోషణ
సిన్సియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా రెహమాన్ తన పాత్రకు సిన్సియర్ గా సూట్ అయ్యాడు. ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ అనుమానం రాకుండా పాత్రలో లీనమై, చివర్లో కొడుకు కోసం చేసిన పొరపాటుకు చింతించడం ఆకట్టుకుంటుంది. మరో ముఖ్యమైన పాత్ర కానిస్టేబుల్ గౌతమ్ కూడా ఆకట్టుకుంటుంది. మిగిలిన నటులు కథను అనుసరించారు.

సాంకేతిక విభాగం
జెక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం కథను అనుసరిస్తే.. సుజిత్ సారంగ్  కెమెరా సస్పెన్స్ ఫీల్ తెచ్చింది.
శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ ఎక్కడా బోర్ కొట్టించలేదు. కార్తీక్ నరేన్ దర్శకత్వం బాగుంది.

 

 

gdsiకథనం-దర్శకత్వం
కెమెరా
చిత్ర నిడివి

 

wksiసీరియస్ క్రైమ్ థ్రిల్లర్

 

విశ్లేషణ
దృశ్యం, క్షణం తరహాలో రూపొందిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ నే ఈ 16. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలామందిని అనుమానించినా చివరకు నిందితుడు పోలీస్ కావడం మనం ‘క్షణం’ లో చూసాం. అలానే ఒక నీచుడి వల్ల తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో చేసిన ప్రయత్నం ‘దృశ్యం’ చిత్రంలో కనిపిస్తుంది.
ఈ 16 చిత్రం కూడా ఒక పోలీస్ ఆఫీసర్ తన కొడుకును కాపాడుకోవడానికి కథ ఎలా నడిపాడన్నదే ఆసక్తికరంగా ఉంటుంది.

సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లు ఇష్టపడేవారికి ఈ చిత్రం ఒక మంచి ఛాయస్ అనుకుంటే.. బి,సి సెంటర్ ప్రేక్షకులకు ఇది సరిపోదు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు కొన్ని కామెడీ సన్నివేశాలు పెట్టే అవకాశమున్నా దర్శకుడు ఈ థ్రిల్లర్ ను సీరియస్ గా చెప్పడానికే ఇష్టపడ్డాడు.

కొక్కొరోకో
2 వీక్స్ (16 రోజులు) గ్యారంటీ

 

 

 

16 EDC Review, 16 (Every Detail Counts) Review

Related posts

Top