Hit and Flop in a row

surendra

ఒక  హిట్..  ఒక ఫ్లాప్..!!

సెంటిమెంట్స్.. కొన్ని కోఇన్సిడెన్స్ ఐతే, మరికొన్ని కోరి తెచ్చుకునేవి.
ప్రస్తుతం హిట్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శింప  బడుతున్న  ధ్రువ  చిత్ర దర్శకుడు సురేంద్ర రెడ్డి మీద ఈ సెంటిమెంట్ అప్లై చేసే అవకాశం  ఉంది. ఎందుకంటారా..?

సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన గత చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం  అవగతమవుతుంది .

‘అతనొక్కడే’  తో దర్శకుడైన  సురేంద్రరెడ్డి.. ఆ చిత్రం ఘనవిజయం  సాధిస్తే , ఆ తరువాత మహేష్  బాబును ‘అతిధి’ గా చూపించి నిరాశపరిచాడు. ఆ తరువాత ‘కిక్’ తో ట్రాక్ ఎక్కి ‘ఊసరవెల్లి’ తో బోర్లా పడ్డాడు. తిరిగి ‘రేసుగుర్రం’ తో వేగం పంచి మళ్ళీ ‘కిక్ 2′ తో షాక్ ఇచ్చాడు.
బహుశా ఈ సెంటిమెంట్ ను అదనుగా భావించి ‘ధ్రువ’ ను రీమేక్ అవకాశం  ఇచ్చారో  ఏమో గానీ, వారి  నమ్మకాన్ని మరోసారి నిలబెట్టాడు ఈ దర్శకుడు. దానితో పాటు ఈ ‘హిట్ & ఫ్లాప్ ఇన్ ఏ రో’  అనే సెంటిమెంట్ ను కూడా.

సురేంద్ర రెడ్డి తరువాత హీరో & బ్యానర్ ఎవరో చూడాలి..!!

Top