Akhil To Romance Niveda Thomas

akhil

అఖిల్ కి జోడిగా నివేదా థామస్

‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు అఖిల్. ఆ  సినిమా డిజాస్టర్ కావడంతో తన  రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మంచి స్క్రిప్ట్ , సరైన  దర్శకుడి కోసం సంవత్సరం పాటు ఎదురు చూసిన అఖిల్ ఇటీవలే ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం లో   రెండో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇష్క్, మనం, 24 సినిమాలతో టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచారు విక్రమ్.

తాజా సమాచారం ప్రకారం ఈచిత్రంలో అఖిల్ కి జోడిగా  మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ నటించనుంది. నాని ‘జెంటిల్ మన్’ తో టాలీవుడ్ కు పరిచయమైన  ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర జోనర్ మరియు ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాతో అయినా అఖిల్ సక్సెస్ ని అందుకోవాలని ఆశిద్దాం.

Tags

Related posts

Top