AlluArjun and Lingusamy team up for a Bilingual

alluarjun-10

 డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో  అల్లు అర్జున్..!

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతి త్వరలోనే తమిళంలో ఓ సినిమా చేయనున్నారు. తెలుగు ,మలయాళం, కన్నడ భాషలలో అభిమానులను సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు తమిళంలో తన  డెబ్యూ చిత్రం తో తమిళ ప్రేక్షకులకు చేరువవనున్నాడు.

స్టార్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో  అల్లు అర్జున్ హీరోగా  స్టూడియో గ్రీన్ పతాకం ఫై  జ్ఞాన్ వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళ , తెలుగు భాషలలో రూపొందించనున్న  ఈ చిత్రం గురువారం చెన్నైలో లాంచ్ అయ్యింది.

ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ‘దువ్వాడ జగన్నాధం’ షూటింగ్ లో బిజీ గా ఉన్న బన్నీ ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాత తమిళ  డెబ్యూ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్ర నటీనటుల వివరాలు  త్వరలోనే అధికారకంగా ప్రకటించనున్నారు.

 

Tags

Related posts

Top