And the award goes to..

eevaram

ఎట్టకేలకు నిర్మాతల చేతుల్లోకి తెలుగుసినిమా..!
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా నిర్మాత చేతులు మారి హీరోల చెంతకు చేరిందనేది అందరికీ తెలిసిన సత్యమే.. దానికి సాక్ష్యమే రిపీట్ కథ-కథనాలతో వచ్చిన కొన్ని సినిమాలు. కథ సంగతి వదిలేసి సేఫ్ బెట్ ఆడాలని తెలుగు కమర్షియల్ హీరోలు నిర్ణయించుకోవడంతో తెలుగు ప్రేక్షకులు వాటిని భరించక తప్పలేదు. కానీ ఈ సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలు హిట్ టాక్ రావడం వెనుక ప్రేక్షకుల ఆదరణతో పాటు నిర్మాతల కథల ఎంపిక కూడా వాటి విజయాలలో ఒక కారణంగా తెలుస్తుంది.

ప్రస్తుత  నిర్మాతల్లో.. హీరో-దర్శకున్ని ప్రక్కన పెట్టి కథలకే ప్రాధాన్య మిచ్చే దిల్ రాజు తరహాలో యు.వి. క్రియేషన్స్ కూడా కథలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో రన్ రాజా రన్ , ఎక్స్ ప్రెస్ రాజా అంటూ దూసుకుపోతుంది. నాగార్జున కూడా కథను నమ్మి కళ్యాణ్ కృష్ణ అనే క్రొత్త దర్శకుడికే తన ఓటేసి సక్సెస్ సాధించాడు. శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో బాలకృష్ణకు మరో హిట్ ఇస్తే.. ఎన్టీయార్-సుకుమార్ లాంటి విచిత్రమైన కాంబినేషన్ ను ఎన్నుకుని బి వి ఎస్ ఎన్ ప్రసాద్ బాక్స్ ఆఫీస్ గట్టెక్కేశాడు.

వీటి విజయాల్ని ఒకసారి పరిశీలిస్తే నిర్మాతల కథల ఎంపికే అందుకు కారణంగా కనిపిస్తుంది. అంటే తెలుగుసినిమా తిరిగి నిర్మాతల చేతిలోకి వచ్చినట్లే కనిపిస్తుంది.

ఇదే ట్రెండ్ కొనసాగితే 2016 నిర్మాతల నామ సంవత్సరంగా నిలిచిపోనుంది.

 

 

And the award goes to.. P R O D U C E R

Top