And the award(s) goes to Akhil

akhil-5

వద్దంటే అవార్డ్స్..

అవార్డు వచ్చిన ప్రతి సినిమాకి కలెక్షన్స్ రావని తెలుగు సినిమాలకు ఒకప్పటి నానుడి. ప్రస్తుతం ట్రెండ్ మారిన నేపథ్యంలో హిట్ – ప్లాప్ లతో సంబంధం లేకుండా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ టార్గెట్ గా సినిమాలు విడుదల చేస్తున్నారు. ఇక సినీప్రముఖులు వారసులు ఆరంగేట్రం అంటే చూడడానికి రెండు కళ్ళు, వినడానికి రెండు చెవులు చాలవు.. అన్నట్లుగా ప్రచారం చేస్తారు.

ఇలా గత సంవత్సరం విడుదలైన అక్కినేని వారసుడు అఖిల్ ఆరంభం వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అనే సినిమాతో ప్రారంభమైంది. విడుదలకు ముందు ఎంత హడావుడి చేసినా, కథ-కథనంలో విషయం లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది.  ఆరోజుతోనే ఆ చిత్రాన్ని సగటు సినీ ప్రేక్షకులు మర్చిపోయారు.

akhil-4-jpg

 

కానీ ఈమధ్య ఏ అవార్డ్ ఫంక్షన్ లో చూసిన ‘అఖిల్’ చిత్రం పేరు తప్పక వినబడుతుంది. అది కూడా బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డ్ విషయంలో.. అంటే సినిమా కథకుడు,దర్శకుడు ఫెయిల్ అయినప్పటికీ హీరో పర్ఫెక్ట్ అంటూ.. సైమా అవార్డ్ మొదలుకుని ఫిలింఫేర్ , మా, సంతోషం.. వంటి ప్రతి అవార్డ్ ఫంక్షన్ లలో డెబ్యూ హీరో అవార్డ్ అక్కినేని అఖిల్ కు దక్కింది.

 

akhil-3

akhil-1

 

ఇటువంటి అవార్డ్స్(ప్లాప్ చిత్రాలకు) దక్కాలంటే.. కేవలం సినీ ప్రముఖుల వారసులకే సాధ్యం. ఇకపై అవార్డ్ రావాలంటే కమల్ హాసన్ తరహాలో ‘ఉత్తమ నటుడు’ అనిపించుకోవాల్సిందే.

Top