భలే భలే సీన్..!

bhale-bhale

ఆ ఒక్క సీనే నచ్చిందట
ఈ రోజే విడుదలైన ‘భలే భలే మగాడివో’ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుందంటూ అందరూ లైక్స్ కొడుతుంటే..  మరోవైపు  ఆ చిత్రంలో హీరో  నాని 8 నిమిషాల ఎమోషనల్ సీన్ ను సింగిల్ టేక్ లో చేయడంతో యూనిట్ అందరూ తెగ మెచ్చుకున్నారట.

ఇదిలా ఉంటే ఈ స్క్రిప్ట్ లో ఆ సీనే నిర్మాత అరవింద్ కు ఫేవరెట్ సీన్ అంటూ హీరో నాని ట్వీట్ చేసాడు. అంటే ఆ ఒక్క సీన్ మినహా మిగిలినవి ఆయనకు నచ్చలేదేమో..!!

‘ప్రేమ కధా చిత్రా’నికి దర్శకునిగా పేరు వేసుకోవద్దని దర్శకుడు మారుతికి ఉచిత సలహా ఇచ్చిన అరవింద్ తరహా నిర్ణయాల ఈ చిత్రానికి ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.

 

bhale bhale magadivo

Top