సుకుమార్‌కు ప్రేమతో… బి.విఎస్.ఎన్ ప్రసాద్

nannaku-prematho-(1)

సుకుమార్‌కు ప్రేమతో… బి.విఎస్.ఎన్ ప్రసాద్
సాధారణంగా సినీరంగంలో అనుబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయని అంటుంటారు. ఒకరిపట్ల మరొకరు చూపించే అభిమానం, ఆప్యాయతలన్నీ  పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయని.. దర్శకనిర్మాతల విషయంలో ప్రేమాభిమానాలు సినిమా చేస్తున్నంతవరకే  కొనసాగుతాయని…ఆ తర్వాత ఎవరి దారి వారిదని.. చెబుతుంటారు. అయితే ఈ విషయంలో కొంత మంది మినహాయింపుగా కనిపిస్తారు. ఆ కోవలోకి చెందిన వారే దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌లు. వీరి స్నేహబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.

 

ఇంతకు ముందు సుకుమార్ దర్శకత్వంలో ఆర్య-2 చిత్రాన్ని తెరకెక్కించిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో ఇటీవలే నాన్నకు ప్రేమతో చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక నాన్నకు ప్రేమతో చిత్రం సాధించిన విజయం గురించి… ఆ సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందన తెలిసిందే.  సో..ఈ అపురూప విజయాన్ని తన సంస్థకు అందించిన దర్శకుడు సుకుమార్‌కు  ప్రేమతో బి.విఎస్.ఎన్ ప్రసాద్ ఓ విలువైన కానుకను అందజేశారు. శుక్రవారం సుకుమార్‌కు బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌త్రీ సీరిస్ కారును బహుమానంగా ఇచ్చారు బీవీఎస్‌ఎన్ ప్రసాద్. ఇలా సుకుమార్ పట్ల తనకున్న ప్రేమను ఈ రీతిలో చాటుకున్నారు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్

Related posts

Top