Chuttalabbayi Nizam release by Bhagyasree films

chuttalabbayi s (1)

నైజాంలో భాగ్యశ్రీ ఫిలింస్‌ ద్వారా ‘చుట్టాలబ్బాయి’ 
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. నైజాంలో భాగ్యశ్రీ ఫిలింస్‌ ద్వారా రాకేష్‌ ఈ చిత్రాన్ని 125 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ – ”చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మా ‘చుట్టాలబ్బాయి’ చిత్రాన్ని ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన భాగ్యశ్రీ ఫిలింస్‌ రాకేష్‌గారు మంచి ఫ్యాన్సీ ఆఫర్‌ ఇచ్చి నైజాం రిలీజ్‌ హక్కులను తీసుకున్నారు. నైజాంలో 125 థియేటర్లలో ఈ చిత్రాన్ని భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అలాగే అన్ని ఏరియాల్లో చాలా మంచి థియేటర్లలో మా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కుటుంబ సమేతంగా అందరూ చూసి ఎంజాయ్‌ చేసే విధంగా డైరెక్టర్‌ వీరభద్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆది పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రం రూపొందింది. ఆది, వీరభద్రమ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి మా బేనర్స్‌కి కూడా చాలా మంచి పేరు తెస్తుంది” అన్నారు.

 

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, బ్రహ్మానందం, పోసాని క ష్ణమురళి, ప థ్వి, రఘుబాబు, క ష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌,

నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి,  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌.

Related posts

Top