Dhruva climax shoot underway

dhruva

క్లైమాక్స్ చిత్రీకరణలో ‘ధ్రువ’  

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కూల్ ప్రీత్ సింగ్ జంట‌గా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ‘ ధృవ’ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. తమిళం లోసూపర్ హిట్ అయినా ‘తాని ఒరువన్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్  పోలిస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.  ఈ చిత్రాన్ని నిర్మాతలు అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ సినిమాకి సంబందించిన క్లైమాక్స్ సన్నివేశాల ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో రాంచరణ్, అరవింద స్వామి పాల్గొన్నారు. ముందుగా దసరా కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వాళ్ళ డిలే అయ్యింది. త్వరలోనే నిర్మాతలు ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని సమాచారం

నటీనటులు
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ – హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, ఆర్ట్ – నాగేంద్ర, ఎడిటర్ – నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్ – అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు – సురేందర్ రెడ్డి

Tags

Related posts

Top