Dhruva Review

dhruva-1

ఎగ్ సిగ్నల్3.25sii
బ్యానర్: గీతాఆర్ట్స్
తారాగణం:  రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి… తదితరులు
సంగీతం: హిప్ హాప్ త‌మిజ్
కెమెరా: పి.య‌స్‌.వినోద్‌
ఎడిటింగ్ :  నవీన్ నూలి
కథ: మోహన్ రాజా
మాటలు: వేమారెడ్డి
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాతలు : అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌
విడుదల:  0 9:12:16

 

కథ
అనగనగ.. పోలీస్ లకు అంతుపట్టని కేసులను, ఐ.పి.ఎస్. ట్రైనింగ్ లో ఉన్న ధ్రువ(రామ్ చరణ్) అండ్  టీమ్ సింపుల్ గా సాల్వ్ చేస్తుంటారు. సమాజంలో జరిగే అన్ని వ్యవస్థీకృత నేరాలకు కారణమవుతున్న ఒకరిద్దరి వైట్ కాలర్ నేరగాళ్లను పట్టుకుంటే మొత్తం సమాజమే బాగుపడుతుందనేది ధ్రువ నమ్మకం. ఈ ప్రయాణంలో ధ్రువ ఎన్నుకున్న శత్రువు సిద్ధార్థ అభిమన్యు(అరవింద్ స్వామి). ఎత్తులకు పై ఎత్తుల మధ్య చివరకు ఎవరు గెలిచారన్నదే ఈ ధ్రువ కథ.

కళాపోషణ
ఐ.పి.ఎస్. ధ్రువ గా రామ్ చరణ్ తన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటే, ధ్రువకు ధీటుగా సిద్ధార్థ అభిమన్యు పాత్రలో అరవింద్ స్వామి సైంటిస్ట్ ముగులోని విలన్ పాత్రలో జీవించాడు. ఇషిక పాత్రలో ధ్రువ ప్రేమికురాలిగా రకుల్ ప్రీత్ ప్రాముఖ్యం ఉన్న పాత్రలో నటించింది. సిద్ధార్థ్ తండ్రిగా ఎమ్మెల్యే పాత్రలో పోసాని చాలా వేరియేషన్స్ చూపించాడు. నవదీప్ రాంచరణ్ స్నేహితుడిగా గుర్తిండిపోయే పాత్రలో కనిపిస్తాడు.

 
సాంకేతిక విభాగం
పి.య‌స్‌.వినోద్‌ కెమెరా పనితనం కథ మూడ్ ను బాగా ఎలివేట్ చేస్తే.. నవీన్ నూలి ఎడిటింగ్ కథను ఆసక్తిగా మలిచింది. మోహన్ రాజా కథ సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉండడంతో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.

 

 

gdsiరామ్ చరణ్ లుక్
కథ-కథనం
అరవింద్ స్వామి
సంగీతం

 

 

wksiపెద్దగా లేనట్లే

 

 

 

విశ్లేషణ
‘తని ఒరువన్’ కు  రీమేక్ గా వచ్చిన ఈ ధ్రువ ను మొదట్లో అందరూ సేఫ్ బెట్ అనుకున్నారు. కానీ రాంచరణ్ తన పాత్రను ఓన్ చేసుకున్న పద్దతి చూస్తే రీమేక్ కు పూర్తి న్యాయం చేసినట్లయింది. దానికి తగ్గట్లే గీతా ఆర్ట్స్ నిర్మాణవిలువలు, దర్శక ప్రతిభ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. హీరో-విలన్ మధ్య ఎత్తుకు పై ఎత్తు సినిమాలు చాలా ఉన్నప్పటికీ ఈ కథ ప్రత్యేకత ఏమంటే..

 

  • విలన్ అంటే మర్డర్లు- మానభంగాలు చేసేవాడు మాత్రమే కాదు..
  • బాగా చదువుకున్న వాడు విలన్ ఐతే నేరాలు ఎలా ఉంటాయన్నది ఈ కథలో చూపించడం..
  • అనుకోకుండా జరిగిన ప్రమాదం వెనుక ఒక మిస్టరీ ఉండడం.. అది కథకు లింక్ అవ్వడం ఈ కథనం ప్రత్యేకత.

 

  • ఒక సాధారణ అవకాశాన్ని ‘చిన్నతనంలోనే అరవింద్ స్వామి తనకు అనుకూలంగా  ఎలా మార్చుకున్నాడన్నదే..’ చాలా  మంచి సన్నివేశం.
  • అలాగే తనకు ఇబ్బంది అనిపించినప్పుడు తండ్రిని కూడా చంపడానికి వెనకాడని తరహా విలనిజం. కమర్షియల్ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయి.
  • విలన్.. ధ్రువ ప్రతి మూమెంట్ పసిగట్టే క్రమంలో ధ్రువ తన ప్రేయసికి తన ప్రేమను వ్యక్తపరిచే తీరు ఒక హైలైట్ ..

అలాంటివి ఈ చిత్రంలో చాలా ఉన్నాయి.

 

చివరికి ఎవరిదీ పైచేయి అనుకుంటే అక్కడ కూడా అరవింద్ స్వామి తన ఆటిట్యూడ్ చూపించాడు.
హీరో తనను కాపాడి మిగిలినవారిని పట్టుకుందామనుకుంటే, అష్ట దిగ్భందనంలో చివరిది చావేనని.. సిద్ధపడడం.

 

అన్నట్లు సీక్వెల్ కు అవకాశం ఉన్న మరో పోలీస్ కథ

అందుకే ఈ చిత్రం రామ్ చరణ్ కు ఒక ‘ఠాగూర్’  అనుకోవచ్చు

 

కొక్కొరోకో
మరో ‘ఠాగూర్’

 

 

 

Dhruva  Review

Related posts

Top