Director VirinchiVarma Interview about Majnu

virinchivarma-s

నాని హీరోగా  ‘ఉయ్యాల జంపాల’ ఫేం విరించివర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజ్ను’. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ , కేవ మూవీస్‌ బ్యానర్ ఫై  పి. కిరణ్ , గీత గొల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని సరసన  అనుఇమ్మాన్యుయ‌ల్‌, ప్రియ శ్రీ  హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ  చిత్రం సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఏసియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా  ప్రేక్షకులముందుకు వస్తుంది. ఈ సంద‌ర్భంగా

దర్శ‌కుడు విరించి వ‌ర్మ‌తో ఇంట‌ర్వ్యూ….

సహాయ ద‌ర్శ‌కుడిగా..  
మదన్‌గారి వద్ద పెళ్ళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు, గుండెఝల్లుమంది సినిమాలకు వర్క్‌ చేశాను. రామ్మోహన్‌గారిని కలిసిన తర్వాత ఆయనకు ఉయ్యాలా జంపాలా కథ నచ్చడంతో సినిమా దర్శకత్వం చేశాను.

మా మజ్ను… హ్యాపీ మజ్ను..
లవ్‌ ఫెయిల్యూర్స్‌ అందరికీ ఉంటాయి. అయితే కొంత మంది మాత్రమే ఆ లవ్‌ఫెయిల్యూర్స్‌ను దాటి వారి ప్రేమను సక్సెస్‌ చేసుకుంటారు. అంత సిన్సియర్‌ లవర్‌ అన్నమాట. అయితే అప్పటి మజ్ను తన ప్రేమ కోసం చనిపోయాడు. కానీ మా మజ్ను సినిమా బాధాకరంగా ఉండదు. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.   ఈ సినిమాలో ముగ్గురి మధ్య ప్రేమ ఉంటుంది కానీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ కాదు. అందుకే డిఫరెంట్‌గా ఉండే టిపికల్‌ లవ్‌స్టోరీ అని ట్రైలర్‌లోనే చూపించాం. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నానితో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌…
ఉయ్యాలా జంపాలా  నుండి నానితో మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో నానికి కథ వినిపించాను. కథ వినగానే నాని సినిమ చేయడానికి రెడీ అయ్యారు. కథ రాసుకునేటప్పుడే నాని అనుకునే కథ రాసుకున్నాను. ఈ సినిమాలో కూడా ఒక పక్క ఏడుస్తూనే నవ్వించేలా సీన్స్‌ ఉంటాయి. ఇలాంటి వేరియన్స్‌ ఉన్న సీన్స్‌లో నాని మాత్రమే నటిస్తాడనిపించింది. తనతో వర్క్‌ చేయడం మంచి అనుభూతినిచ్చింది. షూటింగ్‌ టైంలో కూడా సీన్స్‌ను ఇంకా ఎలా బాగా చేయాలో చెప్పి సీన్స్‌ బాగా రావడానికి ఎంతగానో సపోర్ట్‌ చేశారు. నేను స్క్రిప్ట్‌ రాసుకునేటప్పటి నుండి జాగ్రత్తలు తీసుకుంటాను. కాబట్టి నమ్మకంగా ఉంటాను. కాబట్టి ద్వితీయ విఘ్నం గురించి భయపడలేదు.

రాజమౌళి అసిస్టెంట్‌గా..
సినిమాలో నాని రాజమౌళిగారి అసిస్టెంట్‌గా కనపడతారు. కాబట్టి ఓ సీన్‌లో బాహుబలి చిత్రీకరణ లోకేషన్‌ను మజ్నులో చూపిస్తున్నాం కాబట్టి రాజమౌళిగారు ఈ సినిమాలో కనపడతారు. అలాగే హీరో రాజ్‌తరుణ్‌ కూడా స్పెషల్‌ అప్పియరెన్స్‌లో కనపడతారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఓ కథను రాసుకుంటున్నాను. నా మైండ్‌లో ఆ కథకు ముగ్గురు హీరోలు అయితే సరిపోతారనుకుంటున్నాను. కథ పూర్తి కాగానే వారిని కలిసి కథ చెప్పి ఒప్పుకుంటే సినిమా చేస్తాను.

 

Related posts

Top