‘గోపాలా..గోపాలా’ 200 రోజుల సభకు ప్రత్యేక అతిధి గా మెగాస్టార్..!

150

150 రోజులా.. అదెక్కడ ?

‘గోవిందుడు అందరి వాడేలే’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి ప్రసంగిస్తూ ఉంటే.. అభిమానులు పవర్ స్టార్ ..పవర్ స్టార్.. అని నినాదాలు చేస్తుంటే.. చిరంజీవి అందరినీ శాంతింప చేస్తూ కల్యాణ్ 150 రోజుల ఫంక్షన్ కు వస్తే మీకేమైనా అభ్యంతరమా..? అని అభిమానులను శాంతింప చేశారు. ఆ ఫ్లో లో అందరూ నిజమేగా అని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆలోచిస్తే చిరంజీవి ఉద్దేశ్య పూర్వకంగా అలా అన్నారా.. అని అభిమానులలో సందేహం మొదలైంది. దానికి కారణం లేకపోలేదు.

ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులు ఎవరికీ తెలియనిది కాదు. హిట్ సినిమా అంటే ఒక వారం, సూపర్ హిట్ అంటే రెండు వారాలు , బ్లాక్ బస్టర్ అంటే నాలుగు వారాలు సినిమా ఆడుతున్న ఈ తరుణంలో.. 100 రోజులు కాదు కదా, కనీసం 50 రోజులు కూడా సినిమా ఆడని పరిస్థితిలో చిరంజీవి 150 రోజుల ప్రస్తావన తేవడంలో అర్ధం లేదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

అలాగే 150 రోజులు అంటే ఫిబ్రవరి చివరి వారం. మధ్యలో వచ్చే సంక్రాంతి చిత్రాలను కూడా కాదని గోవిందుడు నిలుస్తుందా అంటే సవాలక్ష ప్రశ్నలు. అంటే అప్పటికి అందరూ మర్చిపోతారని చిరంజీవి అలా అన్నారేమో.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాలా..గోపాలా’ చిత్ర ఆడియో ఫంక్షన్ లో పవన్ ప్రసంగించే సమయంలో అభిమానులు చిరు.. చిరు.. అని నినాదాలు చేస్తే.. అప్పుడు పవన్ కళ్యాణ్ ‘అన్నయ్య 200 రోజుల సక్సెస్ మీట్ కు వస్తే మీకేమైనా అభ్యంతరమా’.. అని అంటారేమో..? చూద్దాం.

Top