Head Constable Venkatramaiah movie launch

hcv-st

 ప్రారంభమైన ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ ల `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`చిత్రం

శ్రీ తిరుమ‌ల తిరుప‌త వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ బ్యానర్ లో  ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌ జంటగా చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు శ్వీయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌’.ఈ చిత్రం ఈ రోజు ఉదయం  రామోజీ ఫిలింసిటీలో అతిర‌థ‌మ‌హార‌థుల స‌మ‌క్షంలో వైభ‌వంగా ప్రారంభమయ్యింది.
60 రోజుల పాటు రామోజీ ఫిలింసిటీ, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.

హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌గా ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి చేయ‌నున్నారు. ఆయ‌న స‌తీమ‌ణిగా జ‌య‌సుధ న‌టించ‌నున్నారు.నీతి,  నిజాయితీ గ‌ల ఓ పోలీస్ అధికారి నిజ జీవితంలో, వృత్తిప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు? వాటిని అదిగ‌మించి విజ‌య‌మెలా సాధించాడ‌నేదే క‌థాంశం తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మిస్తున్నారు. వందేమాత‌రం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సుధాక‌ర్ రెడ్డి : సినిమాటోగ్ర‌ఫీ.

 

head-constable-s

Related posts

Top