Hyper shooting completed

hyper-pos

హైపర్ షూటింగ్ పూర్తి

రామ్ హీరోగా సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో  14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).  ఇటీవలే ఈ చిత్ర యూనిట్ జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే. జార్జియా లో సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేసారు.  దానితో ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఘిబ్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్ రెండో వారంలో ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌

Tags

Related posts

Top