Janatha garage Review

jan (1)

ఎగ్ సిగ్నల్:  2.75sii

బ్యానర్:  మైత్రీ మూవీస్
తారాగణం:  ఎన్టీఆర్, సమాంతా, నిత్యా మీనన్, మోహన్ లాల్, సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్,  బ్రహ్మాజీ, బెనర్జీ, జాన్ ,సితార, దేవయాని .. తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కెమెరా:  తిరు
ఎడిటింగ్ :- కోటగిరి వెంకటేశ్వర రావు
దర్శకత్వం:   కొరటాల శివ.
నిర్మాత :   నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్
విడుదల: 02.09.16

 

కథ
అనగనగ.. గాడ్ ఫాదర్ తరహాలో  ప్రజల సమస్యలు తీర్చడానికి సత్యం(మోహన్ లాల్) అండ్ టీమ్ తమ ఆటో గ్యారేజ్ ను అడ్డాగా మార్చుకుంటే.. ముంబైలో ఎన్విరాన్మెంట్ సైన్స్ స్టూడెంట్ ఆనంద్(ఎన్టీఆర్) ప్రకృతికి తనవంతు సాయం చేస్తుంటాడు. ప్రాజెక్ట్ నిమిత్తం ఆనంద్ హైదరాబాద్ కు రావడంతో.. సత్యం కొడుకు అక్రమ మైనింగ్ కు అడ్డుచెప్పి.. తద్వారా సత్యంను కలవడం. ఆనంద్ ఎవరోకాదు చనిపోయిన తన తమ్ముడు కొడుకేనని సత్యం తెలుసుకోవడం.
ప్రజల్లో జనతా గ్యారేజ్  పట్ల నమ్మకం కోల్పోయే దశలో ఆనంద్ ను జనతా గ్యారేజ్ వారసునిగా సత్యం నియమించడం. నగరంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కు సత్యం కొడుకే కారణమని తెలియడంతో అతనికి విధించిన శిక్షే ఈ జనతా గ్యారేజ్ కథ.

కళాపోషణ
సత్యం గా మోహన్ లాల్ గాడ్ ఫాదర్ తరహాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తే.. ప్రకృతి ప్రేమికుడిగా ఆనంద్ పాత్రలో ఎన్టీఆర్ ఎప్పటిలా జీవించాడు. సమంత, నిత్యా మీనన్ ల పాత్రలు నామమాత్రంగా ఉన్నాయి. మిగిలిన వారు తమ పరిధిలో నటించారు.

సాంకేతిక విభాగం
తిరు ఫోటోగ్రఫీ కథను అనుసరిస్తే.. దేవిశ్రీ నేపథ్య సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది. టైటిల్స్ తో సహా గ్రాఫిక్స్ నాసిరకం గా ఉన్నాయి.

 

 

 

gdsiఎన్టీఆర్ – మోహన్ లాల్

దేవిశ్రీ సంగీతం

 

 

wksiసెకండ్ హాఫ్

వినోదం లేకపోవడం

 

 

విశ్లేషణ
గాడ్ ఫాదర్ ఇండియన్ సిరీస్ అయిన నాయకుడు, గాయం , సర్కార్ మొదలగు చిత్రాల కథ ఆధారంగా రూపొందించినదే ఈ జనతా గ్యారేజ్. మొక్కల ప్రేమికుడి కేరక్టరైజేషన్  ఒక్కటే కొత్తగా ఉంది. కానీ పై చిత్రాల తరహా కథనాన్ని మాత్రం ఇవ్వలేకపోయాడు దర్శకుడు. సత్యం-ఆనంద్ కథలు కలపడంలో కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ.. ఆ తరువాత కథనంలో ఆశక్తి లోపించింది. గ్యారేజ్ కు వచ్చాక ఆనంద్ తన మొక్కలను, హీరోయిన్స్ ను పూర్తిగా వదిలేసాడు. అప్పటినుండి కథ రెగ్యులర్ ఫార్మట్ లోకి వచ్చేసి.. సగటు వీక్షకుడు ఊహించిన దాన్నే, దర్శకుడి చాలా నెమ్మదిగా చెప్పాడు. దర్శకుడు రాసుకున్న సన్నివేశాల కన్నా.. దేవిశ్రీ నేపథ్య సంగీతమే వాటికి బలాన్ని చేకూర్చింది. ఎక్కడన్నా హ్యూమర్ వాడితే కథ టెంపో తగ్గిపోద్దనుకున్నాడో ఏమోకానీ దర్శకుడి అటువైపు చూడలేదు.

కొక్కొరోకో
సీరియస్ గ్యారేజ్

 

 

Related posts

Top