Jayammu nischayammura Review

jayammu-nischayammura-p

ఎగ్ సిగ్నల్: 2.2sii
బ్యాన‌ర్: శివ రాజ్ ఫిల్మ్స్
తారాగణం: శ్రీనివాస్ రెడ్డి ,పూర్ణ, శ్రీవిష్ణు, కృష్ణుడు,రవివర్మ,కృష్ణ భగవాన్,ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, జీవా, ప్రభాస్ శ్రీను, రోలర్ రఘు, ఫిష్ వెంకట్ … తదితరులు
సంగీతం:  రవిచంద్ర
ఎడిటర్ :  వెంకట్
కెమెరా: నాగేష్ బన్నెల్
కథ -స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:  శివరాజ్ కనుమూరి
నిర్మాత:  సతీష్ కనుమూరి, శివరాజ్ కనుమూరి
విడుదల:  25.11.2016

కథ
అనగనగా .. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్ననాటి రోజులు. కరీంనగర్ దగ్గర పల్లెటూరికి చెందిన సర్వమంగళం(శ్రీనివాస్ రెడ్డి) జాతకాల నమ్మకంతో పితా(జీవా) అనే దొంగబాబా మాట వింటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే, కాకినాడ మున్సిపల్ ఆఫీస్ లో గుమస్తా ఉద్యోగం వస్తుంది. తన ట్రాన్స్ఫర్ గురించి, చివరకు తన ప్రేమ విషయంలో కూడా బాబా మాట విన్న సర్వమంగళానికి తన ప్రేమ విషయంలో అడ్డంకులు రావడంతో బాబా మాట ప్రక్కకు పెట్టి తన ఆత్మవిశ్వాసంతో తన ప్రేమను, తన ట్రాన్స్ఫర్ ను ఎలా సాధించుకున్నాడన్నదే ఈ చిత్ర కథ.

కళాపోషణ
సర్వమంగళం గా శ్రీనివాసరెడ్డి తన పాత్రకు సరిపోతే , ప్రేమికురాలిగా పూర్ణ నటించింది. మిగిలిన పాత్రలు కథను అనుసరించాయి.

సాంకేతిక విభాగం
నాగేష్ కెమెరా  ఉన్నంతలో బాగా ఆకట్టుకుంటే, వెంకట్ ఎడిటింగ్ , రవిచంద్ర సంగీతం ఒక మోస్తరుగా ఉంది.
శివరాజ్ కనుమూరి కథ పాతదైనప్పటికీ కథనంలో వేగం లేదు.

 

 

gdsiమంచిప్రయత్నం

 

 

 

wksiకథనం-దర్శకత్వం

 

 

 

విశ్లేషణ
‘అల్పజీవి’ అనే నవల ఆధారంగా రూపొందించిన చిత్రమే ఈ ‘జయమ్ము నిశ్చయమ్మురా..’ తనమీద నమ్మకం లేక జాతకాలపై ఆధారపడే ఒక మధ్యతరగతి జీవుడి కథ. గతంలో ఇదే తరహా కథలు చాలా వచ్చినప్పటికీ  రాజేంద్రప్రసాద్ నటించిన కొబ్బరిబొండం మంచి విజయం సాధించింది. దానికి కారణం కథలో హాస్యానికి పెద్దపీఠ వెయ్యడమే. ఈ  జయమ్ము నిశ్చయమ్మురా.. చిత్రంలో ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లు చెప్పడానికి ప్రయత్నించడంతో చిత్రనిడివి సుమారు ౩గంటలు కొనసాగింది. అంతటితో ఊరుకోని దర్శకుడు రోలింగ్ టైటిల్స్ లోను ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించాడు.

ప్రస్తుత సినిమా ట్రెండ్ కు గానీ, సినిమా స్క్రీన్ ప్లే కు ఏమాత్రం సంబంధం లేకుండా సీరియల్ తరహాలో సాగతీసుకుంటూ పోయాడు దర్శకుడు.
చివరకు చెప్పింది ఏంటా.. అని ఒకేసారి ఆరా తీస్తే..

 

  • మూఢనమ్మకాలు వదలి ఆత్మవిశ్వాసంతో ఉంటే అన్నీ సాధించవచ్చు.

 

ఈ విషయం చెప్పడానికి దర్శకుడు ఆంధ్రప్రదేశ్ కలుసున్న రోజుల్లో అంటూ మొదలెట్టి.. సుమారు  3గంటలు చెప్పాడు.

 
కొక్కొరోకో
‘జయమ్ము….’ సీరియల్ ..రా

 

 

 

Jayammu nischayammura  Review

 

 

 

Top