Jyo achyuthananda Review

jyo-achyutananda-p

ఎగ్ సిగ్నల్:  3sii
బ్యానర్:  వారాహి చలన చిత్ర
తారాగణం:  నారా రోహిత్‌, నాగశౌర్య, రెజీనా, పావని గంగిరెడ్డి, సీత, రాజేశ్వరి, హేమంత్‌,  చైతన్య కృష్ణ,  తనికెళ్ల భరణి, నాని (అతిథి పాత్రలో)  .. తదితరులు
సంగీతం: కల్యాణ్‌ రమణ
కెమెరా:  దిలీప్
ఎడిటింగ్ :
రచన-దర్శకత్వం: శ్రీనివాస్‌ అవసరాల
నిర్మాత :  సాయి కొర్రపాటి
విడుదల: 09.09.16

కథ
అనగనగ.. అచ్యుత రామరారావు(రోహిత్), ఆనంద వర్ధన రావు(నాగ సౌర్య)  అన్నదమ్ములు. పేరుకే వీళ్ళు  అన్నదమ్ములు గాని వారి మధ్య అనుబంధం తక్కువ. క్రొత్తగా వారి ఇంటిపైన అద్దెకొచ్చిన జ్యోత్స్నా(రెజినా)ను అన్నదమ్ములిద్దరూ పోటాపోటీగా ఒకరికి తెలియకుండా ఒకరు  ప్రేమిస్తారు.

చివరకు ఇద్దరు ప్రపోజ్ చేస్తే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రిజెక్ట్ చేస్తుంది. ఆ కోపంలో అచ్యుత రామరారావు(రోహిత్), అమెరికా వెళ్లాలనుకున్న జ్యో పాస్ పోర్ట్ ను కాల్చేస్తాడు. ఆవిషయంపై అచ్యుత్ తండ్రికి కంప్లైంట్ చేద్దామనుకుంటే, ఆ సమయానికే అతనికి గుండెపోటు  వచ్చి, ఆతరువాత చనిపోతాడు. ఇదంతా జ్యో కారణంగానే జరిగిందనుకుంటారు ఆ అన్నదమ్ములు. కొన్నిరోజులకు   జ్యో అమెరికా వెళ్ళిపోతుంది.

కొన్ని సంవత్సరాల తరువాత అన్నదమ్ములిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయి ప్రశాంతంగా ఉంటే జ్యో తిరిగి వచ్చి వారిద్దరినీ ఇబ్బంది పెడుతుంది. చివరకు జ్యో లవ్ మ్యాటర్  సెటిల్ చేసే ప్రయత్నంలో అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏర్పడడమే ఈ ‘జ్యోఅచ్యుతానంద’ కథ.

కళాపోషణ
జ్యో గా రెజీనా, అచ్యుత రామారావు  నారారోహిత్, ఆనంద్ గా నాగసౌర్య లు తమ పాత్రలలో జీవించారు. ముఖ్యంగా అన్నదమ్ములుగా వారి జోడీ బాగుంది.

సాంకేతిక విభాగం
దర్శకుని కథనం-మాటలకు తోడు  దిలీప్ కెమెరా ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ నేపథ్య సంగీతం హాయిగా ఉంటే.. పాటలు మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

 

gdsiకథనం-మాటలు
ఫస్ట్ హాఫ్
నాగసౌర్య-రోహిత్

 

 

wksiసెకండ్ హాఫ్
చెప్పాలనుకున్న కథ

 

 

 

విశ్లేషణ
ప్రథమార్ధంలో.. జరిగిన కథను  అన్నదమ్ములిద్దరూ ఒకరికథ మరోకరు వారి భార్యలకు చెప్పడం, తరువాత అసలుకథ వారి కోణంలో చెప్పడం ఆద్యంతం ఫస్ట్ హాఫ్ లో ఆసక్తి కలిగించాయి. దానికి దగ్గట్లు దర్శకుడి మాటలు చాలా బాగున్నాయి. ఇంచుమించు ప్రతి సన్నివేశంలో సెన్సిబుల్ హ్యూమర్ కనిపించింది.

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల  కథను మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే చెప్పి, ప్రతిభ మొత్తం ప్రథమార్ధానికే పరిమితం చేశాడు. సెకండ్ హాఫ్ లో చెప్పడానికి కథ-కథనం లేక ఫస్ట్ హాఫ్ లో జరిగిన సన్నివేశాలకు కౌంటర్ గా రెండు ఎపిసోడ్స్ నడిపించి, జ్యో తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకున్నట్లు చెప్పాడు. అది కూడా ఓకే అనుకుంటే.. ఇక అక్కడ నుండి కథ ఒక్కసారిగా అన్నదమ్ముల అనుబంధంగా మారిపోయింది. జ్యో కూడా వారిద్దరి మధ్య అనుబంధం పెంచడానికే అలా చేసినట్లు చూపించినా.. మొదట్లో కథ మొదలైన దానికి చివర్లో ఎండ్ చేసిన దానికి మధ్య కొంత అగాధం ఏర్పడింది.
ఫస్ట్ హాఫ్ లో కనిపించిన దర్శకుని మేజిక్, సెకండ్ హాఫ్ లో కనబడదు. అయినప్పటికీ ఉన్నంతలో మంచి హ్యూమర్ అందించాడు శ్రీనివాస్ అవసరాల.

కొక్కొరోకో
ఫస్ట్ హాఫ్ ఆనంద(0)

 

 

 

Jyo achyuthananda  Review

Top