KalyanRam Interview about ISM

ism-kalyan

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ అదితి ఆర్య జంటగా పూరి జ‌గ‌న్నాథ్ దర్శ‌క‌త్వం లో తెరకెక్కిన చిత్రం ‘ఇజం’.    ఈ సినిమాను నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ పతాకం ఫై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ   సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా  హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తో ఇంటర్వ్యూ ..

ఇజం…
‘ఇజం’ అనేది సిద్ధాంతం. ఒక సిద్ధాంతాన్ని ఒక‌రుగానీ, కొంత‌మంది గానీ ఫాలో కావ‌చ్చు. ఆ సిద్ధాంతం వ‌ల్ల స‌మాజానికి మంచి జ‌ర‌గ‌వ‌చ్చు. ఈ సినిమాలో నా పాత్ర కూడా స‌మాజానికి మంచి చేసేదే. స‌మ‌స్య గురించి చెబుతూ చాలా సినిమాలు వ‌చ్చాయి. అయితే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చెబుతూ ముగింపునిచ్చారు. ఈ సొల్యూష‌న్ అదేదో ఎవ‌రికీ అంద‌న‌ట్టు ఉండ‌దు. ఆమోద‌యోగ్యంగానే ఉంటుంది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు.

సిక్స్ ప్యాక్‌ గురించి..
నాలుగు నెల‌ల్లో 12 కిలోలు త‌గ్గా. ఎక్కువ‌గా ఫిష్ తిన్నాను. మామూలుగా నాకు ఫిష్ న‌చ్చ‌దు. మ‌న మెంట‌ల్ ఫిట్‌నెస్‌ను చాలా వ‌ర‌కు ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ ప్ర‌తిబింబిస్తుంది

పూరి తో వ‌ర్కింగ్ ఎక్స్పీరియన్స్…
న‌న్ను నాలాగే ఉండ‌మ‌న్నారు పూరిగారు. నేను ఎలా ఉండాలో ఆయ‌న ఎప్పుడూ చెప్ప‌లేదు. ఎంత స్పీడ్‌గా చేసినా ఆయ‌న పర్ఫెక్ట్ గా చేసేవారు. అందుకే ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం నాకు చాలా ఇష్టంగా అనిపించింది.

రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా..
నా నుంచి ఇక‌పై ఇలాంటి చిత్రాలే వ‌స్తాయి. డిఫ‌రెంట్‌గా చేయ‌క‌పోతే ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. అందువ‌ల్ల డిఫ‌రెంట్‌గా చేయాల‌ని ఫిక్స్ అయ్యాను.

ఇజం హైలైట్స్…
ల‌వ్ స్టోరీ, జ‌ర్న‌లిజంతో పాటు హీరో ఫ్యామిలీ కూడా ఉంటుంది. మూడు లేయ‌ర్లున్న చిత్రం. పూరిగారు చాలా బాగా చేయించారు. ఈ సినిమాకు నాకు అవార్డు వ‌స్తే పూరిగారికి ఇచ్చేయాలి.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌ తో..
తేజ్‌తో నా సినిమా స్క్రిప్ట్ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్
- త్వ‌ర‌లోనే చెబుతాను.

 

Related posts

Top