‘కాటమరాయుడు’ నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్…!

katamarayudu-s

‘కాటమరాయుడు’ నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్…!

పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్న సికింద్రాబాద్ లో ప్రారంభమైంది. పవన్ ఈ నెల 24 నుంచి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ షెడ్యూల్ 15రోజుల పాటు హైదరాబాద్ లోనే జరగనుంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రం లో మొదట సినిమాటోగ్రాఫర్ గా సౌందర్ రాజన్ ను అనుకున్నారు. కానీ ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడడం తో అయన తప్పుకున్నారట. ‘అత్తారింటికి దారేది’ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ళ ఈ సినిమాకి పని చేస్తున్నారట.  ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Related posts

Top