keerthySuresh in AlluArjun’s Tamil Debut

keerthysuresh

అల్లుఅర్జున్ సరసన కీర్తి సురేష్

తెలుగు, కన్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో వ‌రుస విజ‌యాల‌తో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న  అల్లు అర్జున్ ఇటీవలే త‌మిళ ఇండస్ట్రీలోను  అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియోగ్రీన్ పతాకం ఫై జ్ఙాన‌వేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే భారీ హైప్ ని  క్రియేట్ చేసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో  అల్లు అర్జున్ కి జోడిగా కీర్తిసురేష్ నటించనుందట. రామ్ ‘నేను శైలజ’తో తెలుగులో నటించిన కీర్తి ఆ చిత్రంలో మంచి నటన కనబరిచింది. అటు తమిళంలోను స్టార్ హీరోలతో నటిస్తుంది. రెండు భాషలలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కావడంతో కీర్తి నే ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు.  ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ బిజీ గా ఉన్నాడు.  ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక  తమిళ సినిమా సెట్స్ ఫై కి వెళ్లనుందని సమాచారం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం రూపోందుతుంది.

Related posts

Top