khaidi number 150 Review

khaidi

ఎగ్ సిగ్నల్: 3sii
బ్యానర్:  కొణిదల ప్రొడక్షన్ కంపెనీ
తారాగణం:  చిరంజీవి,కాజల్,అలీ,బ్రహ్మానందం,రఘుబాబు, తదితరులు
సంగీతం:దేవిశ్రీప్రసాద్
ఎడిటర్ : గౌతంరాజు
కెమెరా: రత్నవేలు
కథ: మురగదాస్
దర్శకత్వం:వి.వి.వినాయక్
నిర్మాత:  రామ్ చరణ్
విడుదల: 11.05.17

కథ

అనగనగా.. కోల్ కతా జైలు నుంచి తప్పించుకున్న దొంగ శ్రీను(చిరంజీవి)  తన మిత్రుడు అలీ సహాయంతో బ్యాంకాంగ్ వెళ్లిపోయే క్రమంలో సుబ్బలక్ష్మి(కాజల్) ను చూసి ఆ ప్రయాణం విరమించుకోవడం. ఆ రాత్రి రోడ్ మీద జరిగిన ఏక్సిడెంట్ లో అచ్చు తనలాగే ఉన్న వ్యక్తి శంకర్(చిరంజీవి)ను చూసి, శంకర్ ఎవరో తెలియక అతని స్థానంలోకో వెళ్లడం.

శంకర్ హైడ్రాలజీ  చదివిన ఒక గ్రాడ్యుయేట్. నీరూరు గ్రామం తరపున అక్కడి వ్యవసాయ భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న ఒక  కార్పొరేట్ కంపెనీతో తలబడటం. ఆ క్రమంలో 6గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం.
శంకర్ స్థానంలో ఉన్న శ్రీను మొదట డబ్బుకు ఆశపడి కార్పొరేట్ కు ఫేవర్ చేసేక్రమంలో శంకర్ గురించి అంతా తెలుసుకుని ఆ డబ్బు వెనక్కి ఇచ్చి, రైతుల కోసం పోరాటానికి దిగడం.
మీడియా అటెన్షన్ కోసం హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా నిలిపివేయడంతో కార్పొరేట్ దిగిరావడం. శ్రీను శంకర్ ను రక్షించి నీరూరు రైతులకు భూములు తిరిగి ఇప్పించడమే ఈ ఖైదీనెంబర్ 150  కథ.

కళాపోషణ  
శంకర్, శ్రీను పాత్రల్లో చిరంజీవి ఆ రెండు పాత్రలకు న్యాయం చేయడంతో పాటు శ్రీను పాత్రతో ఎంటర్టైన్ చేసాడు. శ్రీను స్నేహితుడిగా అలీ గుర్తుండే పాత్రలో నటించాడు. శ్రీను ప్రేమికురాలు సుబ్బలక్ష్మి గా కాజల్ నటించింది. మిగిలిన పాత్రలో పోసాని, బ్రహ్మానందం, రఘుబాబు కాస్త నవ్వించారు.

సాంకేతిక విభాగం
రత్నవేలు కెమెరా, గౌతంరాజు ఎడిటింగ్, దేవిశ్రీ సంగీతం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దేవిశ్రీ పాటలు. రామ్ చరణ్ నిర్మాతగా మంచి  టెక్నికల్ టీమ్ అందించాడు.

 

gdsiచిరంజీవి
దర్శకత్వం
పాటలు

 

 

wksiవిలనిజం

 

 

 

విశ్లేషణ
చిరంజీవి కం బ్యాక్ ఫిల్మ్ గా రూపొందిన ఈ ‘ఖైదీ నెంబర్ 150′ తమిళ చిత్రం ‘కత్తి’ కు రీమేక్ గా వచ్చింది. రైతుల ఆత్మహత్యలు, కార్పొరేట్ గొడవలు ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో సగటు సామాజిక ఇతివృత్తం ఉండడంతో, దొంగ పాత్రకు ఇంకొంత కామెడీ జోడించి సగటు తెలుగు చిత్రంలా మార్చేశారు మన రచయితలు.
కాజల్ కేవలం పాటలకు మాత్రమే పరిమితమైనట్లు ఉంది. నీరు నీరు… పాటను కేవలం బ్యాక్ గ్రౌండ్ పాటగా ఉండడం కొంచెం నిరాశ పరిచింది. అలీ- చిరు మధ్య కామెడీ సన్నివేశాలు రొటీన్ అయినప్పటికీ ఇబ్బందిపెట్టలేదు. అయినా కొత్తగా ట్రై చేయవలసింది.
‘ఖైదీ’ చిత్రంతో స్టార్ డమ్ సాధించిన చిరంజీవికి, మళ్ళీ ఈ ‘ఖైదీ నెంబర్150′ కం బ్యాక్ ఫిల్మ్ గా రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ మధ్యలో ఈ ‘ఖైదీ నెంబర్ 786′ అంటూ ఈ ఖైదీ పేరుకు సక్సెస్ ఫుల్ కేరాఫ్ ఎడ్రెస్ గా మారారు చిరంజీవి.
ఎక్కడన్నా పొరపాటు పడొచ్చు గానీ నాన్నకు ఇచ్చే గిఫ్ట్ లో మాత్రం పొరపాటు జరగకూడదని సేఫ్ ప్రాజెక్ట్ ఎన్నుకుని మంచిపని చేసాడు రామ్ చరణ్.

కొక్కొరోకో
కలిసొచ్చిన ‘ఖైదీ’

Top