సచిన్ ను తలపిస్తున్న ‘చిరు’

chiru-sachin

సచిన్ ను  తలపిస్తున్న ‘చిరు’

50, 100, 150 నంబర్స్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అన్నట్లు. ముఖ్యంగా క్రికెట్ స్కోర్స్ లో వీటికి ప్రాధాన్యత ఎక్కువ. ఇప్పుడు అదే నెంబర్ తెలుగు సినీ పరిశ్రమలో దర్శక రచయితలను నిద్ర లేకుండా చేస్తుంది. అదే చిరంజీవి 150వ సినిమా.

మొదట్లో ఈ కథల డిస్కషన్ గోప్యంగా జరిగినా, చివరకు చిరంజీవే దర్శక-రచయితలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసారు. ఇంతవరకు ఏ కధా ఫైనల్ కాకపోవడంతో తప్పు కధలదా లేక చిరంజీవే కాస్త ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారో అభిమానులకు అర్ధం కావడం లేదు.

గతంలో చిరంజీవి 100వ సినిమా త్రినేత్రుడు విషయంలో కూడా అభిమానుల్లో ఎక్కువ ఆశక్తి రేపినప్పటికీ .. చివరకు ఆ సినిమా ఫెయిల్యూర్ కావడం గుర్తుంచుకోవాలి.

కెరీర్ చివర్లో సచిన్ కూడా సెంచరీ దగ్గరలో ఎక్కువ శ్రద్ద కనబరచి చివరకు సెంచరీ మిస్ అయిన సందర్భాలు మనకు తెలిసినవే.
అందుకే ఈ 150వ సినిమా మరో త్రినేత్రుడు కాకూడదని కోరుకుందాం.

Top