Majnu gets U/A, movie release on sept 23rd

majnu

నేచురల్‌ స్టార్‌ నాని ‘మజ్ను’ సెన్సార్‌ పూర్తి – వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్‌ 23 విడుదల

 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’.

ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏషియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సునీల్‌ నారంగ్‌ చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, దర్శకత్వం: విరించి వర్మ.

 

 

Tags

Related posts

Top