Majnu Review

majnu-st

 ఎగ్ సిగ్నల్: 2.75sii
బ్యానర్:  ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌
తారాగణం: నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా… తదితరులు
సంగీతం:  గోపీసుందర్‌
కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌
ఎడిటింగ్ : ప్రవీణ్‌ పూడి
రచన-దర్శకత్వం: విరించి వర్మ
నిర్మాత :  పి.కిరణ్‌, గోళ్ళ గీత
విడుదల: 23.09.16

కథ
అనగనగ..  ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఆదిత్య(నాని) హైదరాబాద్ లో సుమ(ప్రియా శ్రీ) అనే అమ్మాయిని లవ్ చేసే ప్రయత్నంలో తన ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పడం. ఆదిత్య భీమవరంలో కిరణ్(ఇమ్మానుయేల్) అనే అమ్మాయిని ప్రేమించడం.. చిన్న..చిన్నమనస్పర్థల కారణంగా విడిపోవడం.  చివరకు సుమ, కిరణ్ లు కజిన్ సిస్టర్స్ కావడమనేది ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే.. తిరిగి కిరణ్ ప్రేమలో పడ్డ ఆదిత్య చివరకు ఎవరికి దగ్గరయ్యాడనేదే  ఈ మజ్ను కథ.

కళాపోషణ
ఆదిత్యగా నాని ఎప్పటిలానే సహజంగా నటిస్తే, కిరణ్ గా ఇమ్మానుయేల్, అనుశ్రీ తమ పాత్రల పరిధిలో నటించారు. వెన్నెల కిషోర్ తెలుగురాని పాత్రలో నవ్వించాడు.

సాంకేతిక విభాగం
జ్ఞానసాగర్ ఫోటోగ్రఫీ, గోపిసుందర్ సంగీతం కథను అనుసరిస్తే.. విరించి వర్మ కథలో పెద్ద విషయం లేకపోయినా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

 

gdsiనాని
సంగీతం
ఫోటోగ్రఫీ

 

 

wksiకథ

 

 

విశ్లేషణ
కిషోర్ తిరుమల మొదటి చిత్రమైన ‘సెకండ్ హ్యాండ్’ కథలానే అనిపిస్తుంది ఈ ‘మజ్ను’. ఒకమ్మాయిని ప్రేమించి విడిపోయి.. మరో అమ్మాయికి తన కథ వినిపించడం.. తరువాత వారిద్దరూ ఫ్రెండ్సో లేక అక్కాచెల్లెళ్లు కావడం అనేది తెలిసిందే. ఫస్ట్ హాఫ్ వరకు కథనం ఇంటరెస్ట్ గా కొనసాగినా ఇంటర్వెల్ తరువాత దర్శకుడు తన మేజిక్ చూపలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో సుమ ప్రేమకథ, తన మొదటి ప్రియుడు మోసగించాడని మరీ రొటీన్ గా చూపించాడు దర్శకుడు.

దర్శకుని దగ్గర అన్ని అస్త్రాలు అయిపోవడంతో గెస్ట్ ఆర్టిస్ట్ లుగా రాజ్ తరుణ్, రాజమౌళిని దింపి కథనాన్ని పూర్తిచేసాడు. ఉన్నంతలో వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. కిరణ్ ఇంటర్వ్యూ కి వెళ్లేముందు నానితో చెప్పించిన మాటలు బాగున్నాయి.

కొక్కొరోకో
పేరుకు దగ్గట్లే అంతగా సక్సెస్ కాలేకపోయాడు

 

Majnu  Review

Top