Manamantha Review

manamantha-still

 

ఎగ్ సిగ్నల్: 3sii
బ్యానర్: వారాహి చలన చిత్రం
తారాగణం: మోహ‌న్ లాల్, గౌత‌మి, అభి రామ్, విశ్వాంత్, రైనా రావ్, అనీషా, నాజర్, ఊర్వశి, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, నవీన్ నేని… తదితరులు
సంగీతం: మహేష్ శంకర్
ఎడిటింగ్: జి.వి.చంద్రశేఖర్
కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్
కధ – దర్శకత్వం:  చంద్ర‌శేఖ‌ర్ యేలేటి
నిర్మాత : సాయికొర్రపాటి
విడుదల: 05.08.16

కథ
అనగనగ..  విజేత సూపర్ మార్కెట్ అసిస్టెంట్ మేనేజర్ సాయిరాం(మోహన్ లాల్) తన ప్రమోషన్ విషయమై తన తోటి ఉద్యోగైన విశ్వనాధ్ (హర్షవర్ధన్)ను నాలుగు గంటలు బంధించమని దాస్ అనే రౌడీకి పురమాయిస్తే.. నాలుగు రోజులైనా విశ్వనాధ్ బయటకు రాకపోవడంతో సాయిరాంకు ఆందోళన పెరగడం. దాస్ కు ఫోన్ చేస్తే.. తన హార్ట్ ఆపరేషన్ కు అవసరమైన లక్షా డెబ్బై వేలు ఇస్తేనే  విశ్వనాధ్ ను విడుదల చేస్తాననడం. ఇది సాయిరాం కథ ఐతే..
మహిత స్కూల్ లో చదువుతూ.. తన చుట్టూ ఉండేవారు కూడా సంతోషంగా ఉండాలనుకునే అమ్మాయి. అలా తన ఇంటి దగ్గర గుడిసెలో ఉండే ఒకబ్బాయిని(వీరశంకర్) స్కూల్ లో చేర్పించడం… అంతా బాగుందనుకుంటే ఆ వీరశంకర్ కనబడకపోవడం.
మహిత.. వీరశంకర్ ను, సాయిరాం.. విశ్వనాధ్ ను వెతికే క్రమంలో మహితకు  విశ్వనాధ్ , సాయిరాం కు వీరశంకర్ లు కనిపించి
కథను సుఖాంతం చేయడమే ఈ ‘మనమంతా’ కథ.

కళాపోషణ
సూపర్ మార్కెట్ మేనేజర్ సాయిరాంగా మోహన్ లాల్ తన పాత్రలో జీవించారు. స్కూల్ గర్ల్ మహితగా రైనా అద్భుతంగా చేసింది. గాయత్రిగా గౌతమి మిడిల్ క్లాస్ మహిళగా నటించింది.

సాంకేతిక విభాగం
రాహుల్ శ్రీవాత్సవ్  కెమెరా పనితనం బాగుంటే.. జి.వి.చంద్రశేఖర్ ఎడిటింగ్, మహేష్ శంకర్ సంగీతం తమ వంతు సాయం అందించాయి. రవితేజ మాటలు, దర్శకుడి కథనం బాగున్నాయి.

 

 

gdsiకథ-కథనం -మాటలు
మోహన్ లాల్
రైనా రావు

 

 

wksiస్లో నేరేషన్

 

 

విశ్లేషణ
దర్శకుడు నాలుగు కథలుగా కథనం చెప్పినప్పటికీ, వారిలో మోహన్ లాల్, మహిత నేపథ్యాలే కథకు ముఖ్యం. గౌతమి ఫ్యామిలీ కష్టాలు, అభిరాం ప్రేమకథ ప్రధాన కథకు కనెక్ట్ చెయ్యకుండా చివరకు వీరు నలుగురు ఒకే ఫ్యామిలీకి చెందినవారిగా చూపించారు.

కిడ్నాపర్ దాస్ మాటమార్చడం ‘ఐతే’ సినిమాను గుర్తుకుతెస్తుంది. అలాగే చిత్ర కథ ‘దృశ్యం’ సినిమాకు మరో వెర్షన్ లా అనిపిస్తుంది. కాకపొతే దృశ్యం అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు.

మనం ఒక మంచి పని చేస్తే.. అది మరో రూపంలో కాపాడుతుంది అనే సారాంశం కథలో కనిపిస్తుంది.

కొక్కొరోకో
‘మంచితనం’అంతా.. ఈ మనమంతా

 

 

Manamantha  Review

Related posts

Top