Manamantha vs Garage

manamantha

మోహన్ లాల్ ను సరిగ్గా వాడుకున్న కొరటాల
జాతీయ ఉత్తమ నటుడు మోహన్ లాల్ ను చాలా గ్యాప్ తరువాత  ఈ మధ్యే మన తెలుగు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే.. వాటిలో ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘మనమంతా’ ఒకటైతే, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మరొకటి.
వీటిలో ముందుగా విడుదలైన ‘మనమంతా’ ఫీల్ గుడ్ థ్రిల్లర్ గా రూపొందినప్పటికీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తరువాత విడుదలైన ‘జనతా గ్యారేజ్’ పక్క కమర్షియల్ చిత్రంగా రూపొంది ఘనవిజయం సాధించింది.
‘మనమంతా’ చిత్రంలో మోహన్ లాల్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే.. ‘జనతా గ్యారేజ్’ లో సత్యం పాత్ర మాస్ లీడర్  కావడంతో, ఆ పాత్రకు  డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించారు. అది బాగా సూట్ అయ్యిందంటున్నారు చిత్ర యూనిట్.

ఆ విధంగా కొరటాల జడ్జిమెంట్  మోహన్ లాల్ పాత్ర విషయంలోను, డబ్బింగ్ విషయంలోను సరిపోయింది.

అన్నట్లు ‘జనతా గ్యారేజ్’ మలయాళంలోనూ మంచి విజయం నమోదు చేసుకుంది.

Related posts

Top