Miss South India 2006 Nakshatra

nakshatra

మిస్ సౌత్ ఇండియా 2016గా నక్షత్ర

 


అందాల పోటీలు అంటే మాటలు కాదు.. ఎంతోమంది సుందరీమణులు పోటీపడతారు. అందులో నుంచి ఒక్కరిని ఫైనల్ చేయడం అంటే అందాల ఆకాశం నుంచి ఒక్క నక్షత్రాన్ని ఫైనల్ చేయడం లాంటిది. ఆ సెలక్షన్ లో ఈ సారి మిస్ సౌత్ ఇండియా 2016గా కిరీటం కొట్టేసిన బ్యూటీ ‘నక్షత్ర’. మిస్ సౌత్ ఇండియా టైటిల్ ను తను ఊహించలేదనీ.. కనీసం రన్నరప్ గా గెలిచినా చాలు అనుకున్న తనకు ఏకంగా టైటిల్ దక్కడం చాలా హ్యాపీగా ఉందని చెబుతోందీ బ్యూటీ. ఇక అందాలపోటీలు అంటే వెండితెరకు ఎంట్రీ టికెట్ లాంటివి.. అందుకే టైటిల్ ను గెలుచుకోగానే నక్షత్రకు కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ ‘రాక్ లైన్’వెంకటేష్ తను తీస్తోన్న లేటెస్ట్ సినిమాలో తీసుకున్నాడు.అలాగే మరో రెండు సినిమాలు కథా చర్చల్లో ఉన్నాయి. 

 


ఒక రకంగా తన కల నెరవేరిందని చెబుతోంది నక్షత్ర. చిన్నప్పటి నుంచే తనకు యాక్టింగ్ అంటే పిచ్చి.. చాలా చిన్న వయసు నుంచే తనూ హీరోయిన్ కావాలని కలలు కన్నానని చెబుతోన్న ఈ బ్యూటీ ఏకంగా 120మంది అందగత్తెలు పోటీ పడ్డ మిస్ సౌత్ ఇండియా టైటిల్ ను గెలుచుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందని చెబుతోంది. మరి అతి త్వరలోనే తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోన్న నక్షత్ర.. మిస్ సౌత్ ఇండియా 2016టైటిల్ విన్నర్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం...

Tags
Top