Money is Honey Ready For Censor

money-is-honey-s

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్ కు రెడి అయిన “మనీ ఈజ్ హాని “

శ్వేతశ్రీ క్రియోషన్స్ పతాకంపై, నూతన నటీనటులను హిరో హిరోయిన్లుగా పరిచయం చేస్తూ జనార్ధన్ శివలంకి దర్శకత్వంలో, జాలే వాసుదేవనాయుడు నిర్మిస్తున్న చిత్రం “మనీ ఈజ్ హాని”. ఈ సినిమా అన్ని కార్యక్రామలను పూర్తి చేసుకొని సెన్సార్ కు రెడి అయ్యింది. ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత జాలే వాసుదేవనాయుడు మాట్లాడుతూ:
నూతన నటినటులతో నేను నిర్మిస్తున్న మనీ ఈజ్ హాని రిలీజుకు రెడి అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే నెల ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అడియోను వచ్చేనెల 15న సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలచేస్తాము అని అన్నారు.

దర్శకుడు జనార్ధన్ మాట్లాడుతూ:
సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది.నన్ను నా కధను నమ్మి నాకు పుర్తి స్వేచ్చ ఇచ్చిన నా నిర్మాత జాలే వాసుదేవనాయుడు గారికి ధన్య వాదములు. నాకు అన్ని విధాలుగా సహకరించిన నటినటులకు టేక్నీషియన్స్ కు నా కృతజ్ఞతలు.

ముఖ్య తారాగణం: జే.వి.నాయుడు, రోషన్, జి.ఎమ్మార్, వెంకీ, ఆషిక్, రచనా స్మిత్, రష్మిజా, బాబు పొకల తదితరులు. మ్యూజిక్ డైరెక్టర్: జి. వసంత్, డి.ఓ.పి: రాజా చక్రం, లిరిక్స్: గుంజా శ్రీను, ఎడిటర్: బి.మహీ. నిర్మాత: జాలే వాసుదేవనాయుదు, కధ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: జనార్ధన్ శివలంకి.

Top