Nagabharanam successmeet

nagabharanam-s

`నాగ‌భ‌ర‌ణం`ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు – మ‌ల్కాపురం శివ‌కుమార్‌

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన తాజా విజువల్ వండర్ నాగభరణం. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం స‌క్సెస్‌మీట్ హైద‌రాబాద్‌లో ఆదివారం సాయంత్రం జ‌రిగింది. ఈ సందర్భంగా

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ “తొలి రోజు 353 సెంట‌ర్ల‌లో సినిమా విడుద‌లైంది. ఇప్పుడు 25 సెంట‌ర్ల‌ను పెంచాం. మొత్తం ఇన్ని థియేట‌ర్ల‌లో సినిమా ర‌న్ అవుతుంది. తొలి రోజు రూ.కోటి 52 ల‌క్ష‌లు క‌లెక్ష‌న్ వ‌చ్చింది. రెండో రోజు రూ.కోటి 12 ల‌క్ష‌లు వ‌చ్చింది. మూడో రోజు క‌లెక్ష‌న్లు బావున్నాయ‌ని రిపోర్ట్ వ‌స్తోంది. ఈ మూడు రోజుల‌కు క‌లిపి దాదాపు నాలుగు కోట్ల రూపాయ‌లు క‌లెక్ష‌న్లు రావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నాం. నైజాంలో 35శాతం, సీడెడ్‌లో 16-17 శాతం, ఆంధ్రాలో 15శాతం రెవెన్యూ ఉంది. అన్ని సెంట‌ర్ల‌లో మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. మ‌హిళ‌లు సినిమాను బాగా ఆద‌రిస్తున్నారు. గ్రాఫిక్స్ `అమ్మోరు`, `అరుంధ‌తి` సినిమాల స్థాయిలో ఉన్నాయ‌ని ప్రేక్ష‌కులు అప్రిషియేట్ చే్స్తున్నారు. విష్ణువ‌ర్ధ‌న్ పోర్ష‌న్ క్లైమాక్స్ లో బావుంద‌ని అంద‌రూ ఫోన్ చేసి చెబుతున్నారు. ఈ సినిమా మ‌రింత స‌క్సెస్ సాధిస్తుంద‌ని భావిస్తున్నాను“అని తెలిపారు.

Related posts

Top