Nagarjuna bags Baahubali 2 Rights

nagarjuna

బాహుబలి  హక్కులను సొంతం చేసుకున్న నాగార్జున , వారాహి

రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం 2015 లో విడుదలై తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. ఈ చిత్రం 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  ఈ చిత్రానికి సీక్వల్ గా బాహుబలి – ది  కన్ క్లూసన్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

బాహుబలి 2 దాదాపు 1000 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను టాలీవుడ్  స్టార్ హీరో చేజిక్కించుకున్నారు. బాహుబలి పార్ట్ 1 కి  కృష్ణ జిల్లా లో దాదాపు 7  కోట్ల వసూళ్ళని సాధించింది.  నిర్మాత వారాహి చలనచిత్ర బ్యానర్ అధినేత సాయి కొర్రపాటితో కలిసి స్టార్ హీరో నాగార్జున ‘బాహుబలి’ పార్ట్ 2 కృష్ణా  జిల్లా పంపిణీ హక్కులను 8 కోట్ల భారీ మొత్తానికి   సొంతం చేసుకున్నారు.

Top