Nanna nenu Na Boyfriends Review

nnnbf-poster

ఎగ్ సిగ్నల్: 2.2sii  
బ్యానర్:  ల‌క్కీ మీడియా
తారాగణం:   రావు ర‌మేశ్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్ బాబు, పార్వ‌తీశం, నోయ‌ల్ సేన్, కృష్ణ‌భ‌గ‌వాన్‌… తదితరులు
సంగీతం: శేఖ‌ర్ చంద్
కెమెరా: చోటా.కె.నాయుడు
ఎడిటింగ్ : చోటా.కె.ప్ర‌సాద్‌
క‌థ‌ :   బి.సాయికృష్ణ‌
దర్శకత్వం: భాస్క‌ర్ బండి
నిర్మాత : బెక్కం వేణుగోపాల్
విడుదల:  16:12:16

కథ
అనగనగ.. తన పెళ్ళైన ఐదు సంవత్సరాలకు పుట్టిన అమ్మాయి జాతకం చూపించిన తండ్రికి ఓ విషాదకర వార్త తెలియడం. పురాణాల్లో హిరణ్యకశిపుడు-ప్రహ్లాదుడు వంటి జాతకం ఆ తండ్రి-కూతురిదని చెప్పిన జ్యోతిష్కుడి మాటవిని.. బాధపడి, అలా జరక్కూడదని, తన కూతురి కోసం తానే మారతానన్న ఒక తండ్రి. ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక ఇంట్లో చెప్పిన సంభందం కాదని, ముగ్గురిని ప్రేమించి.. తన తండ్రి మాటకు ఎదురెళ్ళడం. చివరకు ఆ తండ్రి-కూతుళ్ళ అనుభందం ఏ తీరాలకు చేరిందన్నదే ఈ చిత్ర కథ.

కళాపోషణ
పద్మావతిగా హెబ్బాపటేల్, తన స్నేహితురాలు మ్యాగీ పాత్రలో తేజస్వి తమ పాత్రలను సరిపోతే, బకరా ప్రేమికులుగా అశ్విన్, నోయల్, పార్వతీశం నటించారు.

 

సాంకేతిక విభాగం
చోటా.కె.నాయుడు కెమెరా ఆకట్టుకుంటే, ఈ చిత్ర కథ-కథనం ఆకట్టుకోలేదు. పాటల్లో ఒక పారు.. బాగుంది, నేపథ్య సంగీతం ఓకే.

 

gdsiహెబ్బా
తేజస్వి

 

wksiకథ-కథనం

 

 

విశ్లేషణ
కథ ప్రారంభంలోనే హిరణ్యకశిపుడు-ప్రహ్లాదుడు అంటూ సీరియస్ నోట్ లో మొదలయినప్పటికీ, ఆ తరువాతి సన్నివేశాలు కథకు సరిపడవు.

పెద్దయ్యాక పద్మావతి(హెబ్బా) సరైన కారణం-లాజిక్ లేకుండానే ముగ్గురిని ప్రేమిస్తాననడం, ఆ ప్రస్ధానం కథనాన్ని బోర్ కొట్టించాయి. అది సరిపోనట్లు ఆ ముగ్గురి ప్రేమికులు మధ్య కన్ఫ్యూషన్ సన్నివేశాలు చిరాకు పుట్టించాయి.

రావు రమేష్  పాత్ర కథ మొదట్లో, తిరిగి చివర్లో కనిపించి కొన్ని భారీ డైలాగ్స్ చెప్పి కథను క్లైమాక్స్ కు చేరిస్తే, దీనికి మధ్యలో కథనం అర్ధం-పర్థం లేకుండా నడిచింది.

కొక్కొరోకో
అర్ధం,పర్ధం లేని కథ-కథనం

 

 

Nanna nenu Na Boyfriends  Review

Related posts

Top