Naruda DONORuda Trailer Released by Mahesh Babu

nd

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా న‌రుడా..!డోన‌రుడా..! థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు. గోల్కొండ హైస్కూల్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మ‌ల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్ ను సూపర్‌స్టార్ మ‌హేష్ విడుద‌ల చేసి సుమంత్ అండ్ టీంకు అభినంద‌న‌లు తెలియజేశారు. వీర్య‌దానం అనే కాన్సెప్ట్‌తో పాటు, టైటిల్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. సోష‌ల్ మీడియాలో ఇలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన సుమంత్‌ను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఇన్‌ఫెర్టిలిటీ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ ఆంజ‌నేయులుగా త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వీర్య‌దాత విక్కీగా సుమంత్ న‌ట‌న‌తో పాటు త‌నికెళ్ళ‌భ‌ర‌ణి అసిస్టెంట్‌గా సుమ‌న్‌శెట్టి, హీరోయిన్ ప‌ల్ల‌వి సుభాష్‌లు త‌మ‌దైన శైళిలో ట్రైల‌ర్ క‌నువిందు చేశారు.

ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాత‌లుః వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌.

Related posts

Top