NithyaMenen to play Savithri in Biopic

nithya

మహా నటి సావిత్రి గా నిత్య

మహా నటి సావిత్రి జీవిత కథ ఆదారంగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం  ”ఎవడే సుభ్రమణ్యం” డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వం లో రూపొందనుంది. తెలుగు ,తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహానటి సావిత్రి గా నిత్య మీనన్ నటించనుందట. ఈ విషయంపై దర్శకుడు నిత్యా ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

ఇప్పటికే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా సావిత్రి పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని సినీ వర్గాల టాక్ . ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ ఫై కి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించి వివరాలు వెలువడాల్సి ఉంది.

గతంలో సిల్క్ స్మిత జీవిత చరిత్ర తో హిందీ లో ”డర్టీ పిక్చర్” (2011) చిత్రం  తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ  చిత్రం లో హీరోయిన్ గా విద్య బాలన్ నటించింది.

Related posts

Top