Premam “Bang Bang” song release on 8th September

bang-bang-premam

చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’ లోని ‘బ్యాంగ్ బ్యాంగ్’ పాట ఈ నెల 8 న విడుదల 

  ఆడియో సెప్టెంబర్  20 :  అక్టోబర్ 7 న దసరా కానుకగా చిత్రం విడుదల 
  

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’.  ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ…ఈ చిత్రం లో ‘బ్యాంగ్ బ్యాంగ్ ‘ అంటూ సాగే మరో గీతం ను ఈ నెల 8న విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తెలిపారు.
‘ఈ చిత్రం లోని ఒక పాటను  ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన  విషయం విదితమే. ‘ ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది.

అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న ‘ప్రేమమ్’ ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము.

‘దసరా’ కానుకగా అక్టోబర్  7న ‘ప్రేమమ్’

ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న  ‘దసరా పండుగ’ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్;  ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ , నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ , స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి

Tags

Related posts

Top