Rajamouli appreciates JyoAchyutananda

jyo-po

 జ్యో అచ్యుతానందని ప్రశంసించిన రాజమౌళి

 

నారా రోహిత్, నాగ శౌర్య, రెజినా కాసాండ్రా   ముఖ్య పాత్రలలో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. ఈ చిత్రం శుక్రవారం విడుదలయి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఫై రాజమౌళి ప్రశంశించారు.

వారాహి చలన చిత్రం , శ్రీనివాస్ అవసరాల, కల్యాణ రమణ కాంబినేషన్ లో మరో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్  ‘జ్యో అచ్యుతానంద ‘అని రాజమౌళి ట్వీట్ చేసారు. ఈ చిత్రం లో చక్కటి  కామెడీ వర్క్ అవుట్ అయ్యిందని.. చివరి క్లైమాక్స్  10 నిముషాల హృదయాలను హత్తుకుంటుందని అన్నారు.

నాగ శౌర్య , నారా రోహిత్ ఇద్దరు అన్నదమ్ములుగా బాగా నటించారని, రెజినా ని ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద చూశానని.. ఆమె నటన బావుందని తెలిపారు.  అలాగే ఈ చిత్ర  DOP వెంకట్ ఫోటోగ్రఫీ బావుందని..  ఆర్ట్ డైరెక్టర్ రామ పనితనం బావుందని మెచ్చుకున్నారు.

చివరగా ‘చివరకు మిగిలేది’ నవల ప్రస్తావన దీనికి చిన్న ఉదాహరణ అంటూ ట్విట్టర్ లో రాజమౌళి ఈ జ్యో అచ్యుతానంద టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు.

 

 

 

Related posts

Top