RakulPreetSingh Interview about Winner

rakul

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ `విన్న‌ర్`. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో ఇంట‌ర్వ్యూ…

రోల్ గురించి….
- `విన్న‌ర్‌`లో అథ్లెట్ రోల్ చేశాను. గోపీచంద్ మ‌లినేనిగారు విన్న‌ర్ క‌థ‌ను వినిపించ‌గానే అథ్లెట్ పాత్ర చేయాల‌న‌గానే ఎగ్జ‌యిట్‌మెంట్ వ‌చ్చింది. ఎందుకంటే నా రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌..కొత్తగా చేసే అవ‌కాశం ఉంటుంద‌నిపించింది. ప్రేమ అనే దాని గురించి ఆలోచించ‌కుండా ఓ ల‌క్ష్యంతో ముందుకు సాగే ఇండిపెండెంట్ అమ్మాయి పాత్రలో క‌న‌ప‌డ్డాను. హీరోయిన్ వ‌ల్ల హీరో ఎలా హార్స్ జాకీ మారి త‌న ల‌క్ష్యాన్ని చేరుకున్నాడ‌నేదే క‌థ‌.

ఆడియెన్స్‌ క‌నెక్ట్ అవుతారు…
- విన్న‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ అయినా మంచి ఎమోష‌న్స్ కూడా ఉన్నాయి తేజు సినిమా చూసి ఏడ్చాన‌ని చెప్పాడు. ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోలు హార్స్ రైడింగ్ చేసే స‌న్నివేశాల‌ను సినిమాల్లో చూశాం కానీ ఈ సినిమా పూర్తి స్థాయిలో హార్స్ రైడింగ్ కాన్సెప్ట్‌తోనే ఉంటుంది. హార్స్ రైడింగ్ స‌న్నివేశాల‌ను ట‌ర్కీలో షూట్ చేశారు.

- నేను మెగా హీరోల్లో చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌ల‌తో వ‌ర్క్ చేశాను. మెగా హీరోల‌తో క‌లిసి ప‌నిచేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. మెగా హీరోల‌నే కాదు, నేను ప‌నిచేసే ప్ర‌తి సినిమాను బాగా ఎంజాయ్ చేస్తాను.

తేజుతో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌….
- వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం నుండి నాకు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో మంచి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అప్ప‌టి నుండి మేం ఇద్ద‌రం మంచి ఫ్రెండ్స్‌. అందుకే షూటింగ్ స‌మ‌యంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేశాం. తేజు వంటి కో యాక్ట‌ర్‌తో సినిమా చేయ‌డాన్ని ఎంజాయ్ చేస్తాను. నిజాయితీ గ‌ల వ్య‌క్తి. ఎంత బిజీగా ఉన్నా,త‌న ఫ్యామిలీ కోసం స‌మ‌యాన్ని కేటాయిస్తాడు. హార్డ్‌వ‌ర్క‌ర్‌.

క్యారెక్ట‌ర్ కోసం…
- అథ్లెట్ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. ఎందుకంటే నేను ప్ర‌తిరోజూ వ‌ర్క‌వుట్స్ చేస్తుంటాను. కాబ‌ట్టి పాత్ర కోసం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డలేదు. షూటింగ్ స‌మ‌యంలో కూడా రెండు రోజులు జంపింగ్ ప్రాక్టీస్ చేశానంతే.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌…
- మ‌హేష్‌బాబు, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో ఓ ఫ‌న్నీ క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. ఈ సినిమా గురించి ఇంకేం వివ‌రాలు చెప్ప‌లేను. అలాగే కార్తీతో ఓ సినిమా చేయ‌బోతున్నాను. ఇంకా వేరే సినిమాలేవీ సైన్ చేయ‌లేదు.

Tags

Related posts

Top