Regina Bollywood Entry

regina

 బాలీవుడ్ లో రెజినా ఎంట్రీ

 

కొత్త జంట, పిల్ల నువ్వులేని జీవితం, సుభ్రమణ్యం ఫర్ సేల్ తో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటి రెజినా కాసాండ్రా. ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది . అనీస్ బజ్మీ  దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ఆంఖే 2′ చిత్రంలో  రెజినా నటించనుంది. 2002 లో విడుదలయిన ‘ఆంఖే’ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

అమితాబ్ బచ్చన్, అనీల్ కపూర్, అర్జున్ రామ్ పాల్, అర్షద్ వార్సీ లాంటి గొప్ప నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సౌత్ లో రెజినా నటించిన సినిమాలు చూసి దర్శకుడు రెజీనాని ఎంపిక చేశారట. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజినా చాలా గ్లామరస్ గా కనిపించనుంది. అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ఇలియానా నటించనుంది. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది.

సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లిన ఆసిన్, కాజల్, శృతి హాసన్,తమన్నా, ఇలియానా వంటి నటీమణులు బాలీవుడ్ లో రాణించలేక పోయారు. ప్రస్తుతం రెజినా  వంతు వచ్చింది. రెజినా అయినా బాలీవుడ్ లో  స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటుందేమో చూద్దాం.

Related posts

Top