Sampu..sampu దేశాన్ని ఉపేస్తున్న సంపు ఇజం..!!

sampu

ఆంధ్ర ,తెలంగాణా రాష్ట్రాలను ఉపేస్తున్న సంపు ఇజం
హృదయ కాలేయం చిత్రంతో అటు సినీ ప్రేక్షకులను, ఇటు సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన ఏకైక నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. క్రికెటర్ తన తొలి మ్యాచ్లో శతకం సాధించినట్లు.. సంపు తన తొలి చిత్రంతోనే అన్ని వెబ్ సైట్స్ లలో 3 స్టార్ రేటింగ్ పొంది అరుదైన ఘనత సాధించాడు. తొలి చిత్రం రిలీజ్ కు ముందే బర్నింగ్ స్టార్ బిరుదు పొంది.. తన రెండవ చిత్రం కొబ్బరి మట్ట అని ప్రకటించి స్టార్ హీరోలకు సవాలు విసిరాడు.

ఇదిలా వుంటే.. ఇప్పటికే రాష్ట్ర సంపూర్నేష్ యువత, సంపు యూత్ , సంపు ఫాన్స్ అని చాలా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఈ అభిమాన సంఘాలలో సభ్యత్వం తీసుకోవడానికి స్టార్ హీరోల ఫాన్స్ నుండి భారీగా వలసలు మొదలయ్యాయి.

ఉహించని పరిణామాలకు మతి భ్రమించిన సంపు & టీమ్.. దీన్నే సంపూర్నేష్ ఇజం అని భావించి షార్ట్ కట్ లో సంపు ఇజం గా గుర్తించి.. ఒక పుస్తకం రచించే పనిలో పడ్డాడు సంపు బాబు. దీనికి సంపిజం అనే పేరు పెట్టే ఆలోచనలో ఉన్నాడు.

అలాగే ప్రస్తుతం సంపుకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని.. మన రాష్ట్రాలను మరో చిన్న రాష్ట్రాలుగా విభజించే వరకు వేచి చూసి.. ఆపై రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు. అందుకు తగ్గ ప్రణాలికలు నీరసంగా కొనసాగుతున్నాయి. పుస్తకం రచించాలంటే చాలా పుస్తకాలు చదవాలి కాబట్టి… దానికి కొంత సమయం కేటాయించాల్సి రావడంతో.. సంపు ఇక పై సినిమాల్లో నటిస్తారో లేదో నన్న అనుమానం మొదలైంది. దీనిపై బర్నింగ్ స్టార్ త్వరలో బర్న్ కానున్నారు. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు సంపు ఛానల్ …!!

Top