Savitri audio part 2 ..!

balayya

 

సావిత్రి ని రాజాతో కడిగేస్తారేమో..!
వరుసగా సినిమాలు చేస్తున్న యువ హీరోలలో నారారోహిత్ అందరికంటే ముందుంటాడు. రిలీజ్ అయిన సినిమాలు పెద్ద హిట్ కాకపోయినా ఏవరేజ్ అనిపించుకుంటున్నాయి. అదే వరుసలో తరువాత సావిత్రి విడుదలకు సిద్దంగా ఉంది. సావిత్రి ఆడియో విడుదల సందర్భంగా బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.. సోషల్ మీడియాలో విపరీతమైన అపవాదు ఎదుర్కోవడంతో.. బాలయ్య క్షమాపణలు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు త్వరలో అమరావతిలో జరగబోయే రోహిత్ తదుపరి చిత్రం రాజా చేయ్యివేస్తే.. ఆడియో విడుదలకు మరోసారి బాలయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు హాజరు కానున్నారు.

 

ఈసారి బాలయ్య ఏమి మాట్లాడతారోనని అందరు ఆసక్తిగా గమనించడం ప్రక్కన పెడితే.. బాలయ్య.. లేడీస్ ఫస్ట్, ఆడవారికి ప్రత్యేకం తరహాలో ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దం చేసుకుని ఉంటారు. అలాగని స్టేజి ఎక్కిన  బాలయ్యను నమ్మలేం. వేచి చూడాల్సిందే

మరోవైపు సావిత్రి విడుదల కాక ముందే, రాజాచెయ్యివేస్తే.. ఆడియో కోసం వారాహి టీమ్ పరుగులు పెడుతున్నారంటే.. సావిత్రి విడుదల సందర్భంగా బాలయ్య ఎదుర్కొన్న అపవాదును ఈ రాజా చెయ్యివేస్తే.. ఆడియో లో కడిగేసుకోవడానికే నని పలువురి అభిప్రాయం.

 

ఈసారి బాలయ్య మాటల్లో మార్పు లేకపోతే.. మరో ఆడియో ఫంక్షన్ తక్షణమే జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

Related posts

Top