Siddhardha gets A, movie release on sept 16th

siddhardha-still

సెప్టెంబ‌ర్ 16 న `సిద్ధార్థ‌`విడుద‌ల

సాగ‌ర్ హీరోగా న‌టించిన `సిద్ధార్థ‌` ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న సాగ‌ర్ హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం `సిద్ధార్థ‌`. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది. దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణి నంద్వాని నాయిక‌లు. సెన్సార్ పూర్త‌యింది.

నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ“మా `సిద్ధార్థ‌`కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సెన్సార్ స‌భ్యులు `ఎ` స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మ‌లేషియా, హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించాం. నాలుగు పాట‌లున్నాయి. మ‌ణిశ‌ర్మ‌గారు అందించిన బాణీల‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆయ‌న చేసిన రీరికార్డింగ్ సినిమాకు హైలైట్ అవుతుంది. సాగ‌ర్ బుల్లితెర‌మీద ఎంత‌టి పేరు తెచ్చుకున్నాడో తెలిసిందే. `సిద్ధార్థ‌`లో ఆయ‌న చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను ప్లే చేశారు. ఈ సినిమాతో వెండితెర అభిమానులు కూడా ఆయ‌నికి అభిమానులుగా మారుతారు. ఎస్‌.గోపాల్‌రెడ్డిగారిలాంటి గొప్ప సాంకేతిక నిపుణులతో ప‌నిచేయ‌డం మా అదృష్టం. వైవిధ్య‌మైన జోన‌ర్‌లో సాగే చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ నెల 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం“ అని తెలిపారు. .

ఈ చిత్రానికి కథ – విసు, రచనా సహకారం – రవిరెడ్డి మల్లు, కెమెరా – యస్.గోపాల్ రెడ్డి, సంగీతం – మణిశర్మ, సాహిత్యం – అనంత శ్రీరామ్, మాటలు – పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఫైట్స్ – సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ – బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ – హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత – ముత్యాల రమేశ్, సమర్పణ – లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత – దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం – దయానంద్ రెడ్డి.

Tags
Top