Srirastu subhamastu Review

srirastu-subhamastu-1

 

ఎగ్ సిగ్నల్: 2sii
బ్యానర్: గీతాఆర్ట్స్
తారాగణం: అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, సుబ్బరాజు, హంసానందిని .. తదితరులు
సంగీతం:  తమన్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
కెమెరా: మని కంఠన్
కధ – దర్శకత్వం: పరశురామ్
నిర్మాత : అల్లు అరవింద్
విడుదల: 05.08.16

కథ
అనగనగ..  బిలియనీర్(ప్రకాష్ రాజ్)..  తన పెద్దకొడుకు(రవికాంత్) ప్రేమపెళ్లి విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళను చులకనగా మాట్లాడి .. వచ్చిన కోడలితో కనీసం మాట్లాడని వ్యక్తి. అదే బిలియనీర్ చిన్నకొడుకైన శిరీష్(అల్లు శిరీష్) మరో మిడిల్ క్లాస్ అమ్మాయి అను(లావణ్య త్రిపాఠి) ప్రేమలో పడి..  తండ్రి తో ఛాలెంజ్ చేసి మరీ తన ప్రేమను గెలవడమే ఈ శ్రీరస్తు..శుభమస్తు కథ.

కళాపోషణ
శిరీష్ గా అల్లు శిరీష్ తన పాత్రలో పూర్తిగా జీవించలేకపోయాడు. అక్కడక్కడ అన్న అల్లు అర్జున్ డూప్ లా అనిపించాడు. శిరీష్ బాడీ లాంగ్వేజ్ లో ఈజ్ కనబడలేదు. అను గా లావణ్య త్రిపాఠి ఓకే అనిపించినప్పటికీ పాత్రచిత్రణ బాలేదు. ముఖ్య పాత్రలైనా  లావణ్య తండ్రి రావు రమేష్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి పాత్రచిత్రణలలో క్లారిటీ ఉండవు.

సాంకేతిక విభాగం
మణికందన్ కెమెరా, థమన్ మ్యూజిక్ బావుంటే.. కథ-కథనాలు పెద్దగా ఆకట్టుకోవు.

 

gdsiఉన్నంతలో పాటలు

 

 

 

wksiకథనం

 

 

 

విశ్లేషణ
గతవారం విడుదలై ఘనవిజయం సాధించిన #పెళ్లిచూపులు చిత్రాన్ని చూసిన కళ్ళతో ఈ చిత్రాన్ని చూడడం కష్టమే.  ‘శ్రీరస్తు… ‘ కూడా ఫీల్ గుడ్  చిత్రంగా  రూపొందించినప్పటికీ కథ-కథనాలు 1980-90 దశకాల తరహాలో ఉండి.. ఆసాంతం బోర్ కొట్టిస్తుంది. దానికి తగ్గట్లే శిరీష్ నటన మరో బోనస్.

హీరో, హీరోయిన్ లకు ప్రేమ-పెళ్లి తప్ప, తమకంటూ ఒక గోల్ అంటూ ఉండదు. అలాగే బిలియనీర్..మిలియనీర్ వ్యవహారాలూ కూడా(సూట్ లతో కానిచ్చేశారు)

కథనాన్ని ఒకసారి పరిశీలిస్తే..
*అను తండ్రి(రావు రమేష్), మిలియనీర్ (భరణి) చిన్ననాటి స్నేహితులు.. కూతురి చదువు కోసం భరణి.. రావు రమేష్ కు ఉదారంగా లక్షలు లక్షలు ఇస్తుంటే.. ఐఫోన్ కు 70 వేలు కావాలనే పాత్రచిత్రణ రావు రమేష్ ది.
*చివరకు భరణి కొడుకు, రావు రమేష్ కూతురిని ఇష్టపడి పెళ్ళికి సిద్దపడినప్పుడు.. రావు రమేష్ పెళ్లి చేయడానికి టెన్షన్ పడుతుంటే.. హీరోయిన్ ఇంటికి హీరోవచ్చి అన్ని కష్టాలను(డబ్బు) తీర్చేయడం.
*అంటే ఐఫోన్ కు డబ్బులిచ్చిన వాడు.. పెళ్ళికి మాత్రం ఖర్చు పెట్టలేడా..

ఇటువంటి తరహా సన్నివేశాలు చాలా ఉంటాయి.

వాటిని భరించడం కంటే గతవారం సినిమా  #పెళ్లిచూపులు ఇంకోసారి చూడడం ఆనందం..ఆరోగ్యం.

 
కొక్కొరోకో
నీరసం..అసహనం

 

 

Srirastu subhamastu  Review

 

/

Related posts

Top