SriSatyaSaiBaba shooting in Prasanthi Nilayam

srisathyasaibaba

ప్ర‌శాంతి నిల‌యంలో షూటింగ్ జ‌రుపుకొంటున్న “ శ్రీ స‌త్య‌సాయి బాబా “

 

సౌభాగ్య చిత్ర , ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం – “శ్రీ స‌త్య‌సాయి బాబా “. ` అమ్మోరు `, ` అరుంధ‌తి` , `దేవుళ్లు ` , వంటి విజువ‌ల్ వండ‌ర్స్ ని అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్మ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రాటం రాంబాబు నిర్మాత . పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబా పై తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాల్ని అందిస్తున్నారు. జొన్న‌విత్తుల సింగిల్ కార్డులో 14 పాట‌ల‌కు సాహిత్యం అందిచ‌డం విశేషం . ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. ఎదైతే పుట్ట‌ప‌ర్తిలో జ‌రిగిన సంఘ‌ట‌నల్ని య‌థాత‌థంగా ఈ సినిమాని తీస్తున్నాం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ని రామానాయుడు స్టూడియోస్ లో వేసిన “ప్ర‌శాంతి నిల‌యం “భారీ సెట్ లో నెల రోజుల షూటింగ్ జ‌రుగుతోంది. మార్చి 10 వ‌ర‌కు ఈ షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ సినిమా “ స‌త్య‌సాయి బాబా “ జీవిత చ‌రిత్రని చూపించే అపురూప‌మైన చిత్రం ఇది. ప్ర‌పంచంలోనే ఎక్క‌డ లేని విధంగా స‌త్య‌సాయి గారు చేప‌ట్టిన క్యాష్ లెస్ ప్రీ హార్ట్ స‌ర్జ‌రీ , అన్ని ఫ్రీ గా ఇచ్చేట్టు పుట్ట‌ప‌ర్తిలో ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే . ఇప్ప‌టికి కూడా ఇది అమలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అద్భుత‌మైన విష‌యాల గురించి తెలియ చెప్పే దే ఈ చిత్రం.

స‌త్య‌సాయిగా మ‌ల‌యాళ న‌టుడు శ్రీజిత్ విజ‌య్ నటిస్తున్నారు. స‌త్య‌సాయికి మాతృమూర్తిగా జ‌య‌ప్ర‌ద , తండ్రి పాత్ర‌లో శ‌ర‌త్ బాబు న‌టిస్తున్నారు. ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ కి మేక‌ప్ మేన్ గా ప‌నిచేసిన ర‌మేష్ మెహంతి ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. ఇప్పిటికే పాట‌ల రికార్డింగ్ పూర్త‌యింది. మంగళంప‌ల్లి బాల ముర‌ళి కృష్ణ త‌న చివ‌రి సినిమా సాంగ్ కూడా ఈ సినిమానే కావ‌డం విశేషం. ఈ సినిమా పాటల్లో ఆయ‌న పాట హైలెట్ గా నిలుస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి ఎస్.పి . బాల‌సుబ్ర‌మ‌ణ్యం , వందేమాతరం శ్రీనివాస్ , చిత్ర ,హ‌రిచ‌ర‌ణ్ , విజ‌య్ ప్రకాష్ , క‌వితా కృష్ణ‌మూర్తి , కైలాస్ కేర్ , సుఖ్వింద‌ర్ సింగ్ , మ‌ల్లాడి బ్ర‌ద‌ర్స్ , ఆండ్రియా , టిప్పు , త‌దిత‌రులు గానాల‌పన చేశారు. ప్ర‌ఖ్యాత ఛాయ‌గ్రాహ‌కుడు వాసు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.

Related posts

Top