#Thikka kudirindha Brother

thikka-brother

‘తిక్క’ కుదిరిందంటున్న అల్లు అభిమానులు

ఇటీవల ఏ ఆడియో ఫంక్షన్  జరిగినా  మెగా అభిమానులు ‘పవర్ స్టార్.. పవర్ స్టార్..’ అంటూ నినాదాలు చేయడం తెలిసిందే. అది ఒక్కోసారి శృతిమించడం జరుగుతుంది. దానిపై అల్లు అర్జున్  తన అసహనం వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ ‘పవర్ స్టార్’ గురించి “చెప్పను బ్రదర్” అన్న మాట ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది.

ఆ తరువాత ‘తిక్క’ ఆడియో వేదికగా అభిమానుల అల్లరిని అదుపు చెయ్యలేక వారిని ఉత్సాహపరుస్తూ, సాయి ధరమ్  తేజ్    మిమ్మల్ని “ఆపను బ్రదర్” అన్న మాట  ట్రెండ్ అయ్యింది.

అప్పటినుండి అదను కోసం ఎదురుచూస్తున్న అల్లు ఫ్యాన్స్ కు తిక్క రూపంలో మంచి అవకాశం వచ్చింది.
విడుదలైన సాయి ధరమ్ తేజ్  ‘తిక్క’ నిరాశపరచడంతో, అల్లు ఫ్యాన్స్ ‘తిక్క కుదిరింది బ్రదర్’ అంటూ ట్విట్టర్ లో మరోసారి ట్రెండ్ చేశారు.

మెగా ఫ్యాన్స్ మధ్య ఈ చిలిపిగొడవలకు ‘స్వపక్షంలో విపక్షం’ అనే  తరహాలో సాగుతున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే., “….. బ్రదర్” అనే ట్యాగ్ ఇకపై కూడా కొనసాగేలావుంది.

 

 

 

#ThikkakudirindiBrother

Related posts

Top