Thikka Review

thikka-p

ఎగ్ సిగ్నల్:  1.5sii
బ్యానర్: శ్రీ వెంకటేశ్వ‌ర మూవీ మేక‌ర్స్
తారాగణం: సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారీసా బోనేసి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు… తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
ఎడిటింగ్:  కార్తీక్ శ్రీనివాస్‌
కెమెరా:  కె.వి.గుహ‌న్‌
కధ  : షేక్ దావూద్‌
దర్శకత్వం:  సునీల్ రెడ్డి
నిర్మాత : .సి.రోహిన్ రెడ్డి
విడుదల: 13.08.16

కథ
అనగనగ.. సరదాగా కాలం వెళ్లతీసే ఆదిత్య(సాయి ధరమ్ తేజ్) మద్యం మత్తులో అంజలితో(లారీసా) ప్రేమలోపడడం. కొన్ని సిల్లీ రీజన్స్ తో అంజలి.. ఆదిత్యకు దూరం కావాలనుకోవడం.  ఫ్రెండ్స్ కు ఇచ్చిన బ్రేక్- అప్ పార్టీలో మద్యం మత్తులో జరిగిన కన్ఫ్యూజన్ లో ఈ కథలోకి ఒక డాన్, ఒక వేశ్య, మరికొన్ని పాత్రలు ప్రవేశించి కొంత రగడ తరువాత చివర్లో ప్రేమికులు ఒకటి కావడమే ఈ తిక్క.

కళాపోషణ
సాయి ధరమ్ తేజ్ తన పాత్రలో తన పరిధి మేరకు నటిస్తే.. లారీసా బోనేసికి తెలుగులో ఇదే మొదటి మరియు చివరి చిత్రం కావచ్చు. అలీ, రాజేంద్ర ప్రసాద్ , రఘుబాబు లు ఉన్నా చేసింది ఏమీ లేదు.

సాంకేతిక విభాగం
కథ-కథనం బాలేనప్పుడు ఎన్ని హంగులు ఉన్న వాటికి విలువుండదు. దర్శకుడి అవగాహన లోపం స్పష్టంగా కనిపించింది.

 

gdsiఏమీ లేవు

 

 

 

wksiఅన్నీ మైనస్ లే

 

 

 

విశ్లేషణ
సినిమా మొదట్లో ధూమపానం-మద్యపానం హానికరం అని వేసే స్లోగన్ కు వెటకారంగా  వాయిస్ ఇచ్చిన విధానంలోనే దర్శకుడి ప్రతిభ అర్ధమవుతుంది. అప్పుడే థియేటర్ నుండి బయటకు వచ్చేస్తే మూడుగంటల సమయం ఆదా అయ్యేదే.

హాలీవుడ్ చిత్రం ‘హ్యాంగోవర్ ‘ తరహాలో వ్రాసుకున్న కథలో ఆత్మ లోపిస్తే, దర్శకుడు  కథనంలో చూపించిన తిక్క అంతా- ఇంతా కాదు. దర్శకుడి నిస్సహాయత మొదటి సన్నివేశం నుండి చివరి వరకు కనిపిస్తుంది.

వినోదం కోసం కథనం రూపొందించాలనుకుంటే.. చాలారకాలుగా చెయ్యవచ్చు. కానీ ఎవరికీ కనెక్ట్ కానీ(బహుశా దర్శకుడికి కూడా) సన్నివేశాలతో  వీక్షకులను చాలా ఇబ్బంది పెట్టారు. చివర్లో బురఖా ముసుగులో చేసిన తికమక సన్నివేశాలు అరగంట పాటు ప్రేక్షకుడిని నరకం అంచులదాకా తీసుకెళ్లాయి.

దర్శకుడికి టెక్నికల్ అంశాలపై పట్టుందని హీరో చాలా సార్లు చెప్పాడు. కథ తరువాతే టెక్నికల్ అంశాలని ఇప్పటికైనా తెలుసుకోవాలి.

కొక్కొరోకో
తికమక ‘తిక్క’

 

 

 

Thikka  Review

Related posts

Top