This week releases

inkokkadu-11

ఈ వారం రిలీజ్స్
ఒకవైపు జనతా గ్యారేజ్ కలెక్షన్స్ స్టడీగా ఉంటే ఈ వారం మరో మూడు చిత్రాలు విడుదల అవుతున్నాయి. వాటిలో విక్రమ్ నటించిన ‘ఇంకొక్కడు’ డబ్బింగ్ చిత్రంగా విడుదలౌతుంటే, శ్రీకాంత్ సినిమా ‘మెంటల్’ , కొర్రపాటి సాయి వారాహి బ్యానర్ లో శ్రీనివాస అవసరాల దర్శకత్వంలో నాగసౌర్య, నారా రోహిత్ , రెజీనా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘జ్యో అచ్యుతానంద’ ఒకటి.
వీటిలో శ్రీకాంత్ ‘మెంటల్’ మాస్ ప్రేక్షకుల టార్గెట్ గా రూపొందితే.. ‘జ్యో అచ్యుతానంద’ మల్టీప్లెక్స్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినదిగా తెలుస్తుంది. ఇక విక్రమ్ గతచిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ‘ఇంకొక్కడు’ ఓపెనింగ్స్ మౌత్ టాక్ పై ఆధారపడి ఉంది.

ఇంకొక్కడు సెప్టెంబర్ 8 న విడుదల అవుతుంటే.. ‘మెంటల్’ , జ్యో అచ్యుతానంద సెప్టెంబర్ 9 న విడుదల అవుతున్నాయి.

Related posts

Top