రచయితను వెంటాడుతున్న ట్రాఫిక్ పోలీసులు..!!

ra-bv

రైటర్ ను వెంటాడుతున్న ట్రాఫిక్ పోలీసులు

బైక్ ను అని వ్రాయబోయి రైటర్ అని వ్రాసారనుకుంటున్నారా.. రైటర్ కరెక్టే. వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కువగా వినబడుతున్న పేరు రవి. రచయిత దర్శకుడు ఐన రవి వరుసగా దొరకడం పట్ల రచయితల సంఘం తమ ఆందోళన వ్యక్తం చేస్తే.. దర్శకుల సంఘం జాగ్రత్త పడాలని సూచించింది.. కోర్ట్ తన పని తాను చేసుకుపోయింది. ఇదిలా ఉంటే ఒకే రచయిత ఇన్నిసార్లు పట్టుబడడం పై కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకం గా నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వాటిని యధాతదంగా మీకోసం ..

రవి ప్రవృత్తి – డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడడం ఐతే.. వృత్తి – సినీ రచయిత కావడంతో.. తను సహజంగా వ్రాసే సన్నివేశాల్లో ట్రాఫిక్ పోలీసులను కించ పరిచే సన్నివేశాలు ఎక్కువ ఉండడంతో.. స్పోర్టివ్ గా తీసుకోని పోలీసులు వలపన్ని ఈ విధంగా పట్టుకుంటున్నారని ఒక కథనమైతే..

రవి సర్కిల్ లో పెద్ద హీరోలు, దర్శకులు ఉంటారు కాబట్టి వారు తీసుకునే మద్యం కూడా ఫారిన్ బ్రాండ్స్ ఉండడంతో.. వాటిని రెగ్యులర్ గా తీసుకునే షాప్ లో కాకుండా వేరే షాప్ లో తీసుకోవడంతో.. మొదటి షాప్ ఓనర్ రివెంజ్ స్టొరీనే.. రవి పట్టుబడడం అని మరో రిపోర్ట్.

పై రెండు కథనాలలో ఏది నిజమోనని ఒక వైపు ఎసెమ్మెస్ కాంటెస్ట్ జరుగుతుంటే.. మరోవైపు మూడో కథనం తెర పైకి వచ్చింది. రచయిత రవికి, డ్రైవర్ ను పెట్టుకునే స్థోమత ఉండి, ఆ అవసరం ఎంతో ఉన్నా.. తనే స్వయంగా కారు నడపడం పై కోపంగా ఉన్న ‘భాగ్యనగర్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్’ కూడా తమ వంతు ప్రయత్నం చేసి ఈ విధంగా బుక్ చేసినట్లు తెలుస్తుంది.

గత నాలుగు నెలలలో కనీసం 8సార్లు ఈ విధంగా పట్టుకోవడానికి ప్రయత్నించినా రవి త్రుటిలో తప్పించుకున్నాడని మరో కథనం.

ఏది ఏమైనా.. రవి ఒక డ్రైవర్ ను పెట్టుకుని, పాత షాప్ లోనే మద్యం తీసుకుంటూ.. ఇక పై ట్రాఫిక్ పోలీస్ లపై మంచి సన్నివేశాలు వ్రాస్తే ఇకపై రచయిత రవికి ఈ బాధ తప్పుతుందేమో చూద్దాం.

Top