Zee Cinemalu – 7 Days 7 Premieres for the first time

z-cinemalu

టెలివిజన్ చరిత్రలోనే సంచలనం
7 డేస్ 7 ప్రీమియర్స్

జీ ఎంటర్ టైన్ మెంట్ నెట్ వర్క్ నుంచి సగర్వంగా ప్రారంభమైన జీ సినిమాలు ఛానెల్…. ప్రారంభమైన తొలివారం నుంచే ప్రేక్షక దేవుళ్ల ఆదరణతో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 4న విడుదలైన జీ-సినిమాలు 24 గంటల మూవీ ఛానెల్… ప్రారంభమైన తొలివారంలోనే అర్బన్ మార్కెట్లో 122 టీవీఆర్ తో సంచలనం సృష్టించింది. గతంలో ఏ మూవీ ఛానెల్ ఈ స్థాయిలో ప్రారంభమైన తొలివారంలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో… టెలివిజన్ చరిత్రలోనే తొలిసారిగా ఓ సరికొత్త సంచలనానికి నాంది పలికింది జీ సినిమాలు. దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని 7 రోజుల పాటు.. ప్రతి రోజు ఓ ప్రీమియర్ ను వీక్షకులకు అందించాలని నిర్ణయించింది.

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన ఈ సినిమాలన్నీ.. దసరా రోజుల్లో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించనున్నాయి. హారర్, యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్.. ఇలా వివిధ జానర్స్ కు చెందిన సూపర్ హిట్ సినిమాలు… అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయి. శివగంగ (అక్టోబర్ 1), జయసూర్య (అక్టోబర్ 2), జాదూగాడు (అక్టోబర్ 3), వర్ణ (అక్టోబర్ 4), శీనుగాడి లవ్ స్టోరీ (అక్టోబర్ 5), తులసీదళం (అక్టోబర్ 6), ధీరుడు (అక్టోబర్ 7) సినిమాలు ఈ దసరాను మరింత మనోరంజితం చేయబోతున్నాయి.

సో… జీ సినిమాలు ఛానెల్ పెట్టుకోండి… అక్టోబర్ 1 నుంచి 7 వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు… 7 డేస్ 7 ప్రీమియర్స్ ను ఎంజాయ్ చేయండి…

Top